Director Krish : ఛ.. క్రిష్ తీసిన సీన్స్ ఉంటే హరిహర వీరమల్లు పెద్ద హిట్ అయ్యేది.. పార్ట్ 2 కూడా అవసర్లేదు.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్..
సినిమా రిలీజ్ ముందు వరకు కూడా మాట్లాడని క్రిష్ ఇపుడు ఘాటీ ప్రమోషన్స్ లో హరిహర వీరమల్లు గురించి మాట్లాడుతున్నాడు.(Director Krish)

Director Krish
Director Krish : ఇటీవల పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో వచ్చిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మం, రాబిన్ హుడ్ కాన్సెప్ట్ కలిపి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేక ఫ్లాప్ అయింది. ఈ సినిమాకు రెండు పార్టులు కూడా ఉన్నాయి. మొదట ఈ సినిమాని క్రిష్ డైరెక్ట్ చేయగా అనివార్య కారణాలతో క్రిష్ తప్పుకోవడంతో జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసాడు.(Director Krish)
సినిమా రిలీజ్ ముందు వరకు కూడా మాట్లాడని క్రిష్ ఇపుడు ఘాటీ ప్రమోషన్స్ లో హరిహర వీరమల్లు గురించి మాట్లాడుతున్నాడు. అసలు తనకు రాసుకున్న స్క్రిప్ట్ ఇది కాదు, నేను షూట్ చేసిన సీన్స్ చాలా లేవు అని చెప్పుకొచ్చాడు.
Also Read : SSMB 29 : రాజమౌళి మహేష్ సినిమా షూట్.. కెన్యా ఫారిన్ మినిస్టర్ పోస్ట్ వైరల్.. 120 దేశాల్లో మూవీ రిలీజ్ అంటూ..
క్రిష్ మాట్లాడుతూ.. హరిహర వీరమల్లు సినిమాలో నేను షూట్ చేసింది కేవలం 30 శాతమే ఉంది. నేను ఇంకా చాలా షూట్ చేశాను. అసలు నేను అనుకున్న కథ ఇది కాదు. నేను తీసిన ఫుటేజ్ ఇంకా 40 నిముషాలు ఉంది. నేను ఎక్కువగా సీన్స్ ఢిల్లీ దర్బార్ లో ఉండేవి తీసాను. అన్నపూర్ణ స్టూడియోలో ఢిల్లీకి సంబంధించి పెద్ద సెట్ వేసాము. ఎర్రకోటలోని దర్బార్, కాస్ మహాల్, మహిర్ సింహాసనం.. ఇవన్నీ తయారు చేయించాము. షాజహాన్ ఎపిసోడ్స్ ఉంటాయి. షాజహాన్ నుంచి మహిర్ సింహాసనం ఔరంగజేబు తీసుకెళ్లే సీన్ నేను మొదట షూట్ చేశాను. పవన్ కళ్యాణ్ గారితో మేము చేసిన సీన్స్ అన్ని అదిరిపోతాయి. ఎక్కువ యాక్షన్ సీన్స్ ఉంటాయి. నేను హరహర వీరమల్లు ఢిల్లీ వెళ్లిన తర్వాత సీన్స్ షూట్ చేశాను. యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయి. పవన్ కళ్యాణ్ కోహినూర్ ని దొంగిలించడం, ఔరంగజేబు సింహాసనం మీద కూర్చోవడం, ఔరంగజేబుకి సవాలు విసరడం.. ఇలాంటి చాలా సీన్స్ షూటింగ్ చేసాము అని చెప్పారు.
దీంతో క్రిష్ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా ఈ సీన్స్ అంతా పార్ట్ 2 లో ప్లాన్ చేసుకున్నారు అని తెలుస్తుంది. కథ పరంగా హరిహర వీరమల్లు డిల్లి దగ్గరికి చేరుకోవడంతోనే సినిమా అయిపోయింది. అసలు ఫస్ట్ పార్ట్ లో అక్కర్లేని సీన్స్ తీసేసి ఈ సీన్స్ అన్ని పెట్టి ఉంటే సినిమా పెద్ద హిట్ అయ్యేది. పార్ట్ 2 కూడా అవసరం ఉండేది కాదు అని ఫ్యాన్స్, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అనవసరంగా కథని సాగదీసి పార్ట్ 2 అని ప్రకటించారని అంటున్నారు. హరిహర వీరమల్లు రిజల్ట్ కి పార్ట్ 2 వచ్చే అవకాశం లేదనే తెలుస్తుంది. మరి క్రిష్ తీసిన సీన్స్ ఎలా బయటకి వస్తాయో అని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
Also See : Sobhita Dhulipala : షూట్ గ్యాప్ లో వంటలు వండుతున్న శోభిత ధూళిపాళ.. ఫోటోలు వైరల్..