SSMB 29 : రాజమౌళి మహేష్ సినిమా షూట్.. కెన్యా ఫారిన్ మినిస్టర్ పోస్ట్ వైరల్.. 120 దేశాల్లో మూవీ రిలీజ్ అంటూ..

రాజమౌళితో దిగిన ఫోటోలను కెన్యా ఫారిన్ మినిస్టర్ ముసాలియా ముదావాది తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి..(SSMB 29)

SSMB 29 : రాజమౌళి మహేష్ సినిమా షూట్.. కెన్యా ఫారిన్ మినిస్టర్ పోస్ట్ వైరల్.. 120 దేశాల్లో మూవీ రిలీజ్ అంటూ..

SSMB 29

Updated On : September 3, 2025 / 6:41 AM IST

SSMB 29 : మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో SSMB29 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంకచోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ ఇండియాలో పూర్తిచేసుకొని ఇప్పుడు మూడో షెడ్యూల్ షూటింగ్ ఆఫ్రికాలోని కెన్యా దేశంలో జరుపుకుంటుంది.(SSMB 29)

ఇటీవల ప్రియాంక చోప్రా కెన్యా నుంచి పలు ఫోటోలు షేర్ చేయడంతో సైలెంట్ గా సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిసింది. అయితే తాజాగా రాజమౌళి, మూవీ యూనిట్ కెన్యా ఫారిన్ మినిస్టర్ ముసాలియా ముదావాదిని కలిశారు. ఈ భేటీలో నిర్మాత KL నారాయణ, రాజమౌళి, రాజమౌళి తనయుడు SS కార్తికేయతో పాటు అక్కడి భారతీయ ప్రతినిధులు పాల్గొన్నారు.

Also See : Sobhita Dhulipala : షూట్ గ్యాప్ లో వంటలు వండుతున్న శోభిత ధూళిపాళ.. ఫోటోలు వైరల్..

ముసాలియా ముదావాది

రాజమౌళితో దిగిన ఫోటోలను కెన్యా ఫారిన్ మినిస్టర్ ముసాలియా ముదావాది తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. రాజమౌళి రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. చాలా శక్తివంతమైన కథనాలను, విజువల్స్‌ను, మంచి సాంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పారు. తూర్పు ఆఫ్రికా అంతటా పర్యటించి అనంతరం రాజమౌళి టీమ్‌ 120 మంది కెన్యాను సెలెక్ట్ చేసుకున్నారు. మసాయి మరా మైదానాల నుంచి అందమైన నైవాషా, ఐకానిక్‌ అంబోసెలి వంటి ప్రాంతాలు ఆసియాలోనే అతిపెద్ద సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో భాగం కాబోతున్నాయి. 120 దేశాల్లో ఈ మూవీని విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్‌ చేస్తోంది.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా చేరువయ్యే అవకాశం ఉంది. కెన్యాలో షూటింగ్‌ చేయడం ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ప్రపంచ వేదికపై మా దేశ అందాలను, ఆతిథ్యాన్ని, సుందర దృశ్యాలను చూపెట్టడంలో ఈ సినిమా ఒక శక్తివంతంగా పనిచేస్తుంది. SSMB 29 సినిమాతో కెన్యా తన చరిత్రను ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయంలో మా దేశం చాలా గర్వపడుతోంది అని రాసుకొచ్చారు.

Also Read : Pawan Kalyan, Allu Arjun : మొన్న అలా.. నేడు ఇలా.. వాళ్ళు వాళ్ళు ఎప్పటికైనా ఒకటే.. ఫ్యాన్స్ ఇప్పటికైనా మారుతారా?

దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. కెన్యాలో షూటింగ్ జరగడమే కాక, సినిమాని 120 దేశాల్లో రిలీజ్ చేస్తారు అని చెప్పడం, గ్రాండ్ గా సినిమా ఉండబోతుందని కెన్యా మంత్రి చెప్పడంతో సినిమాపై మరింత అంచనాలు పెంచుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమా మొదటి అప్డేట్ నవంబర్ లో రానుంది అని ఇటీవలే ప్రకటించారు మూవీ యూనిట్.