Vedam Movie : అల్లు అర్జున్ లేకుండానే ‘వేదం 2’.. డైరెక్టర్ కామెంట్స్.. క్లైమాక్స్ లో ఆ సీన్ నుంచి లీడ్ తీసుకొని..
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా క్రిష్ మీడియాతో మాట్లాడిన ఇంటర్వ్యూలో వేదం 2 గురించి మాట్లాడాడు.(Vedam Movie)

Vedam Movie
Vedam Movie : 2010 లో డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కన సినిమా వేదం. కమర్షియల్ గా ఈ సినిమా పర్వాలేదనిపించినా ఒక క్లాసిక్ సినిమాలా నిలిచిపోయింది. ఇప్పటికి ఈ సినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు. అనుష్క, అల్లు అర్జున్, మనోజ్ కెరీర్లో ఈ సినిమాలో పాత్రలు బెస్ట్ క్యారెక్టర్స్ గా నిలుస్తాయి.(Vedam Movie)
అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడూ అనుకున్నట్టు ఎవరూ చెప్పలేదు. సినిమా ఎండింగ్ లో అల్లు అర్జున్, మంచు మనోజ్ పాత్రలు కూడా చనిపోవడంతో సినిమాకు ముగింపు అనుకున్నారు. అయితే తాజాగా ఈ సినిమా సీక్వెల్ పై డైరెక్టర్ క్రిష్ కామెంట్స్ చేసారు. క్రిష్ దర్శకత్వంలో అనుష్క మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఘాటీ సినిమా సెప్టెంబర్ 5 రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా క్రిష్ మీడియాతో మాట్లాడిన ఇంటర్వ్యూలో వేదం 2 గురించి మాట్లాడాడు.
Also Read : Lokah Movie : మరోసారి వివాదం.. సూపర్ హిట్ సినిమాపై కర్ణాటక నెటిజన్ల విమర్శలు..
క్రిష్ మాట్లాడుతూ.. వేదం సినిమా క్లైమాక్స్ లో అనుష్క ట్రైన్ లో వెళ్ళిపోతూ ఉంటుంది. బయట వర్షం పడుతుంది. జీవితం మీద ఆశ ఉంది అన్నట్టు ముగింపు ఉంటుంది. అప్పుడే ఈ క్యారెక్టర్ కి సీక్వెల్ అనుకోని అనుష్క తో మళ్ళీ పనిచేద్దాం అని షూటింగ్ లోనే చెప్పాను. ఆ సినిమాలో సరోజ అనే వేశ్య పాత్రతోనే కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. తిలక్ గారు రాసిన ఊరి చివర ఇల్లు అనే నవల బాగుంటుంది. అందులో రమ అనే వేశ్య పాత్ర గొప్పగా ఉంటుంది. దాన్ని ఆధారంగా తీసుకొని అనుష్కకి సరోజ సీక్వెల్ లాగా ఒక కథ చెప్పాను. దాన్ని ఒక గొప్ప లవ్ స్టోరీగా మార్చాను. దాంతో అనుష్క ఎప్పుడూ అడుగుతూ ఉంటుంది సరోజ సినిమా ఎప్పుడు అని. కానీ దానికి సమయం పడుతుంది అని తెలిపాడు.
క్రిష్ కామెంట్స్ తో వేదం సినిమాలో అల్లు అర్జున్, మనోజ్ పాత్రలు చనిపోతాయి కాబట్టి అనుష్క సరోజ పాత్ర తోనే సపరేట్ సినిమా తీస్తారని తెలుస్తుంది. అనుష్క వేశ్యగా నటిస్తూనే ఓ లవ్ స్టోరీగా సరోజ అనే టైటిల్ తోనే సినిమా ఉంటుందని భావిస్తున్నారు. మరి క్రిష్ – అనుష్క కలిసి ఈ సినిమా ఎప్పుడు తీస్తారో చూడాలి.