Oscar Nomination Movie: ఆస్కార్ నామినేషన్స్‌లో ఉన్న “ఛలో షో” కథ ఇదే..

భారత తరుపు నుంచి ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్స్ కు 'RRR' లేదా 'కాశ్మీరీ ఫైల్స్' వెళ్తాయి అని అనుకున్న అంచనాలను తారుమారు చేస్తూ ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ గుజరాతీ మూవీని ఎంపిక చేసి షాక్ ఇచ్చింది. ఆస్కార్ బరిలో భారతీయ చిత్రంగా "ఛలో షో" మూవీ నిలవబోతున్నట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించింది ఫిల్మ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా.

Oscar Nomination Movie: భారత తరుపు నుంచి ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్స్ కు ‘RRR’ లేదా ‘కాశ్మీరీ ఫైల్స్’ వెళ్తాయి అని అనుకున్న అంచనాలను తారుమారు చేస్తూ ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ గుజరాతీ మూవీని ఎంపిక చేసి షాక్ ఇచ్చింది. ఆస్కార్ బరిలో భారతీయ చిత్రంగా “ఛలో షో” మూవీ నిలవబోతున్నట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించింది ఫిల్మ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా.

RRR For Oscars: “ఆర్ఆర్ఆర్ ఫర్ ఆస్కార్స్”.. ఇంకా ఛాన్స్ ఉంది!
ప్రపంచ వ్యాప్తంగా RRR ఆస్కార్ గెలుచుకునే ఛాన్సులు ఉన్నాయి అంటూ ప్రశంసలు వచ్చినా, భారత ప్రభుత్వం గుజరాతీ మూవీని ఎంపిక చేయడంతో.. ఆ సినిమా కథ ఏంటనే చర్చలు నడుస్తున్నాయి. సింపుల్ గా చెప్పాలి అంటే ఈ కథ ‘ఛలో షో’ సినిమా దర్శకుడి ఆత్మ కథ అని చెప్పవచు. దర్శకుడు ‘పాన్ నలిన్’ బాల్యంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

“ఒక తొమ్మిది ఏళ్ళ కుర్రాడు సినిమాపై మక్కువతో, ఎలాగైనా థియేటర్ లో సినిమా చూడాలనే ఆశతో ప్రొజెక్టర్ టెక్నీషియన్‌కు లంచం ఇచ్చి ప్రొజెక్షన్ బూత్‌లో కూర్చుని వేసవి కాలం మొత్తం సినిమాలు చూడడమే” ఈ మూవీ కథాంశం. అక్టోబర్ 14, 2022న విడుదల కాబోతున్న ఈ చిత్రం.. ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్స్ వేయగా, వల్లాడోలిడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గోల్డెన్ స్పైక్‌ని గెలుచుకుంది.

ట్రెండింగ్ వార్తలు