Rajinikanth – Amitabh : ఇండియన్ సూపర్ స్టార్స్ ఇద్దరూ ఒకే చోట.. వెట్టైయాన్ సినిమా షూట్ లో రజిని, అమితాబ్

ప్రస్తుతం రజినీకాంత్ వెట్టైయాన్ షూటింగ్ జరుగుతుంది. నేడు ముంబైలో ఈ సినిమా షూట్ జరగ్గా అమితాబ్ షూటింగ్ లో పాల్గొన్నారు.

Amitabhj Bachchan And Rajinikanth in Vettaiyan Sets at Mumbai Photos goes Viral

Rajinikanth – Amitabh Bchchan : జైలర్ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రజినీకాంత్ ప్రస్తుతం ‘జై భీమ్‌’ డైరెక్టర్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టైయాన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దసరా విజయన్‌, రక్షన్.. లాంటి స్టార్ కాస్ట్ నటిస్తున్నట్టు ఆల్రెడీ గతంలోనే ప్రకటించారు. ఇది రజినీకాంత్ 170వ సినిమా కావడం విశేషం.

Also Read : Baak Movie Review : ‘బాక్'(అరణ్‌మనై 4) మూవీ రివ్యూ.. వామ్మో.. ఓ రేంజ్‌లో భయపెట్టారుగా..

ప్రస్తుతం ఈ వెట్టైయాన్ షూటింగ్ జరుగుతుంది. నేడు ముంబైలో ఈ సినిమా షూట్ జరగ్గా అమితాబ్ షూటింగ్ లో పాల్గొన్నారు. వెట్టైయాన్ సెట్స్ నుంచి అమితాబ్, రజిని ఫొటోలను లైకా సంస్థ షేర్ చేసింది. ఇద్దరు ఇండియన్ సూపర్ స్టార్స్ ఒకే చోట స్టైలిష్ లుక్స్ తో కనపడటంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. ఇక ఈ వెట్టైయాన్ సినిమా ఈ సంవత్సరం చివర్లో రిలీజవుతుందని సమాచారం.