Union Budget 2024 live updates : కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు నిధుల వరద..

పార్లమెంట్ లో ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

Minister Nirmala Sitharaman

Union Budget 2024 : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఉదయం 11గంటలకు బడ్జెట్ ప్రసంగాన్ని ఆమె ప్రారంభించారు. ముఖ్యంగా బడ్జెట్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఏ మేరకు కేటాయింపులు ఉంటాయనే అంశం తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

LIVE NEWS & UPDATES

  • 23 Jul 2024 11:59 AM (IST)

    బీహార్‌లో రోడ్లు, ప్రాజెక్టులకు రూ.26 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు.
    బీహార్ లో రూ.21 వేల కోట్లతో పవర్ ప్లాంట్ కూడా ప్రకటించారు. దీంతోపాటు బీహార్‌కు ఆర్థిక సాయం అందనుంది.

    బీహార్‌లో 3 ఎక్స్‌ప్రెస్‌వేల ప్రకటన.
    బుద్ధగయ-వైశాలి ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించబడుతుంది.
    పాట్నా-పూర్నియా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం.
    బక్సర్‌లోని గంగా నదిపై రెండు లైన్ల వంతెన.
    బడ్జెట్‌లో బీహార్‌లో పర్యాటక రంగానికి పెద్దపీట వేశారు.
    నలందలో పర్యాటక అభివృద్ధి
    బీహార్‌లో రాజ్‌గిర్ టూరిస్ట్ సెంటర్ నిర్మాణం
    వరద విపత్తుపై బీహార్‌కు రూ.11000 కోట్లు అందించడం.

  • 23 Jul 2024 11:42 AM (IST)

    కేంద్ర బడ్జెట్ లో ఏపీపై ప్రత్యేక దృష్టి.

    ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న నిర్మలా సీతారామన్.
    ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా నిధులు.
    ఏపీ రాజధానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తాం.
    అదనంగా రూ.15వేల కోట్లు కేటాయింపు.
    అమరావతి నిర్మాణం కోసం బహుళ సంస్థల ద్వారా నిధులు.
    ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు.
    ఏపీలో పారిశ్రామిక కారిడార్ కు ప్రత్యేక నిధులు.
    సాధ్యమైనంత త్వరగా పోలవరం పూర్తి చేస్తాం.

  • 23 Jul 2024 11:36 AM (IST)

    బహుపాక్షిక అభివృద్ధి ఏజెన్సీల నిధుల ద్వారా బిహార్ కు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది.

  • 23 Jul 2024 11:35 AM (IST)

    దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యకోసం విద్యార్థులకు రూ.10లక్షల వరకు రుణాలు.

  • 23 Jul 2024 11:34 AM (IST)

    హైదరాబాద్ - బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు

  • 23 Jul 2024 11:33 AM (IST)

    వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి స్కీంలో భాగంగా రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు.

  • 23 Jul 2024 11:32 AM (IST)

    ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు నిధుల వరద..
    విశాఖ, చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్లు.

  • 23 Jul 2024 11:29 AM (IST)

    బడ్జెట్ లో ఏపీకి రూ.15వేల కోట్లు ప్రత్యేక ఆర్థిక మద్దతు
    ఆంధ్రప్రదేశ్ పున:వ్యవస్థీకరణకు కట్టబడి ఉన్నామన్న నిర్మలా సీతారామన్
    పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామని వెల్లడి.

  • 23 Jul 2024 11:27 AM (IST)

    నిరుద్యోగుల కోసం మూడు పథకాలు..
    ప్రధాన మంత్రి ప్యాకేజీలో భాగంగా మూడు ఉద్యోగ అనుసందాన ప్రోత్సాహకాలు. ఈపీఎఫ్ వోలో నమోదు ఆధారంగా వీటి అమలు.
    సంఘటిత రంగంలోకి ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో చెల్లింపు.
    గరిష్ఠంగా రూ. 15వేలు చెల్లింపు. నెలకు గరిష్ఠంగా రూ.1లక్ష లోపు వేతనం ఉన్నవారు అర్హులు.
    210 లక్షల మంది యువతకు లబ్ధి.

  • 23 Jul 2024 11:20 AM (IST)

    ఆర్థి వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది : నిర్మలా సీతారామన్

    భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది.
    భారత్ లో ద్రవ్యోల్బణం అదుపులో ఉంది.
    ఈ బడ్జెట్ పేదలు, మహిళలు, యువత, రైతులపై దృష్టి పెడుతుంది.
    బడ్జెట్ లో ఉపాధి, నైపుణ్యాలపై దృష్టిసారించింది.
    బడ్జెట్ లో యువతకు రూ. 2లక్షల కోట్లు కేటాయింపు.
    ఈ బడ్జెట్ అందరి అభివృద్ధి కోసం.
    ఇది అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క రోడ్ మ్యాప్.
    ఇంధన భద్రతపై ప్రభుత్వం దృష్టి.
    ఉపాధి పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించి ప్రాధాన్యత నిస్తుంది.
    సేంద్రియ వ్యవసాయాన్ని పెంచడంపై దృష్టి సారించాలి.
    32 పంటలకు 109 రకాలను ప్రారంభించనుంది.
    వ్యవసాయ రంగం అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత.

  • 23 Jul 2024 11:13 AM (IST)

    పేదరికం, మహిళలు, యువత, రైతులపై ప్రత్యేక దృష్టి.
    యువతకు ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి.
    నాలుగు కోట్ల ఉద్యోగ కల్పనకు ప్రధాన మంత్రి ప్రత్యేక నిధి.
    ఆహార, ఇంధనేతర ద్రవ్యోల్బణం 3.1కి పరిమితమైంది.
    మధ్యంతర బడ్జెట్ లో ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగింపు.
    వ్యవసాయం, పరిశోధన రంగాలకు ప్రాధాన్యత.
    ప్రజల మద్దతుతో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాం.
    దేశ ద్రవ్యోల్బణం 3.1 శాతంగా ఉంది.
    అన్నదాతలకోసం ఇటీవల పంటల కనీస మద్దతు పెంచాం.
    మరో ఐదేళ్ల పాటు 80కోట్ల మందికి ఉచిత రేషన్.

  • 23 Jul 2024 11:11 AM (IST)

    నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం లైవ్ ..

  • 23 Jul 2024 11:10 AM (IST)

    పేపర్ లెస్ గా కేంద్ర బడ్జెట్
    టాబ్ లో చూసి బడ్జెట్ చదువుతున్న ఆర్ధికమంత్రి
    ఏడోసారి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న నిర్మల సీతారామన్

     

  • 23 Jul 2024 11:09 AM (IST)

    పార్లమెంట్ ఆవరణలో ఆప్ ఎంపీల ఆందోళన.

    కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల దుర్వినియోగం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన.

  • 23 Jul 2024 10:47 AM (IST)

    పార్లమెంట్ కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

  • 23 Jul 2024 10:46 AM (IST)

    కేంద్ర బడ్జెట్ వైపు ఆశగా చూస్తున్న బీహార్, ఏపీ
    ఎన్డీఏలో కీలకంగా ఉన్న టీడీపీ, జేడీయూ
    ప్రత్యేక హోదా, ఆర్థిక సాయం కోరుతున్న బీహార్, ఏపీ
    రంగాల వారిగా వివిధ అంశాలకు కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలని తెలంగాణ విజ్ఞాపనలు కేంద్రం ముందుంచిన రేవంత్ రెడ్డి.
    ఎన్నికలున్న రాష్ట్రాలకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇస్తారా..?
    మరికొద్ది నెలల్లో మహారాష్ట్ర, హర్యానా, ఝార్ఖండ్, జమ్మూకాశ్మీర్ లో ఎన్నికలు

  • 23 Jul 2024 10:40 AM (IST)

    మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి ఇవాళ బడ్జెట్‌ను పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు కేంద్ర బడ్జెట్ 2024 కాపీలను సిబ్బంది పార్లమెంటుకు తీసుకువచ్చారు.

     

  • 23 Jul 2024 10:37 AM (IST)

    బడ్జెట్ కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్..

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ఇవాళ సమర్పించే కేంద్ర బడ్జెట్ ను ఆమోదించడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం పార్లమెంట్ లో సమావేశమైంది. అనంతరం బడ్జెట్ కు ఆమోదం తెలిపింది.

  • 23 Jul 2024 09:57 AM (IST)

    కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆమె బృందం రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్ కాపీని అందజేశారు. ఈ సందర్భంగా 2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతి తీసుకున్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు స్వీట్ తినిపించారు.

  • 23 Jul 2024 09:48 AM (IST)

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బృందంతో కలిసి నార్త్ బ్లాక్ లోని మంత్రిత్వ శాఖ వెలుపల బడ్జెట్ టాబ్ ను ఆవిష్కరించారు.

  • 23 Jul 2024 09:45 AM (IST)

    బడ్జెట్ కు ముందు లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
    డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.64 వద్ద ప్రారంభం.
    సెన్సెక్స్ 80,745 వద్ద, నిఫ్టీ 24,559 దగ్గర ట్రేడింగ్ ప్రారంభం.

  • 23 Jul 2024 09:42 AM (IST)

    రాష్ట్రపతి ద్రౌపదిముర్ముని కలిసిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయమంత్రి పంకజ్ చౌదరి, ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు.
    2024-25 బడ్జెట్ ప్రవేశ పెడుతున్నట్లు రాష్ట్రపతికి సమాచారం ఇచ్చి అనుమతి తీసుకున్న ఆర్ధికమంత్రి.

  • 23 Jul 2024 09:36 AM (IST)

    బడ్జెట్ ప్రవేశానికి ముందు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బడ్జెట్‌కు ముందు మార్కెట్‌లో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి.

  • 23 Jul 2024 09:35 AM (IST)

    బడ్జెట్ లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం లభించే అవకాశం ఉంది.
    రూ. 12లక్షల వరకు పన్ను శ్లాబ్ లో మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • 23 Jul 2024 09:34 AM (IST)

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖకు చేరుకున్నారు.
    కాసేపట్లో ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కానున్నారు.
    బడ్జెట్ కాపీని కూడా ఆమె రాష్ట్రపతికి అందజేయనున్నారు.

  • 23 Jul 2024 09:34 AM (IST)

    మోదీ ప్రభుత్వంలో వరుసగా ఏడోసారి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.
    గత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను కేంద్రం ప్రవేశపెట్టింది.
    ఇవాళ ప్రవేశపెట్టే బడ్జెట్ వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు