తెలుగు రాష్ట్రాల్లో స్థూలకాయంతో ఎంత మంది బాధపడుతున్నారో తెలుసా?

తెలంగాణలో స్థూలకాయంతో బాధపడుతున్నవారిలో మహిళలు 30.1 శాతం, పురుషులు 32.3 శాతం మంది ఉన్నారు.

Nirmala Sitharaman

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఆర్థిక సర్వే 2023-24ను విడుదల చేశారు. పలు అంశాలతో పాటు దేశ ప్రజల్లో స్థూలకాయ సమస్య పెరిగిపోతోందన్న విషయాన్నీ ఆర్థిక సర్వే బయటపెట్టింది. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ ఈ సమస్య గణనీయంగా పెరిగినట్లు సర్వే తెలిపింది.

దేశంలో 18-69 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారిలో చేసిన సర్వేలో ఈ విషయాలు తేలాయని చెప్పింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైన వివరాలు ప్రకారం.. సగటున 22.9 శాతం పురుషులు స్థూలకాయంతో బాధపడుతున్నారు. గత ఏడాదితో పోల్చితే మహిళల్లో స్థూలకాయం 20.6 శాతం నుంచి 24 శాతానికి పెరిగింది.

ఢిల్లీ మొదటి స్థానంలో తమిళనాడు రెండో స్థానంలో ఉన్నాయి. ఢిల్లీలో మహిళల్లో ఇది 41.3 శాతం, పురుషుల్లో 38 శాతం ఉంది. ఏపీలో స్థూలకాయంతో బాధపడుతున్న మహిళలు 36.3 శాతం, పురుషులు 31.1 శాతం మంది ఉన్నారు. తెలంగాణలో స్థూలకాయంతో బాధపడుతున్నవారిలో మహిళలు 30.1 శాతం, పురుషులు 32.3 శాతం మంది ఉన్నారు.

తమిళనాడులో 37 శాతం పురుషులు, 40.4 శాతం మహిళల్లో స్థూలకాయం ఉంది. పట్టణ ప్రాంతాల్లో స్థూలకాయం పెరిగింది. కరోనా, లాక్‌డౌన్ ప్రభావంతో పరిమిత స్థాయిలో శారీరక శ్రమ వల్ల ఇది గణనీయంగా పెరిగినట్టు పరిశోధకులు తేల్చారు.

Also Read: బలవంతం చేయొద్దు.. సుప్రీంకోర్టులో యూపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..

ట్రెండింగ్ వార్తలు