Venkatesh Rana Daggubati Netflix Rana Naidu Season 2 Shooting Happening
Rana Naidu 2 : వెంకటేష్, రానా దగ్గుబాటి మెయిన్ లీడ్స్ లో నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ పాపులర్ అవ్వడమే కాక వివాదాల్లో కూడా నిలిచింది. మొదటిసారి వెంకటేష్, రానా ఈ రేంజ్ బోల్డ్ కంటెంట్‌తో వెబ్ సిరీస్ చేయడంతో వేరే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నా తెలుగు ఆడియన్స్ మాత్రం ఈ సిరీస్ ని చూడలేకపోయారు. పలువురు తెలుగు సెలబ్రిటీలు కూడా ఇదొక బూతు సిరీస్ అని కామెంట్స్ చేసారు.
కానీ వెంకటేష్, రానా, నెట్ ఫ్లిక్స్ ఈ కామెంట్స్ ఏమి పట్టించుకోకుండా రానా నాయుడు సిరీస్ సీక్వెల్ ని గతంలోనే ప్రకటించింది. ఒక్కసారి చూడటమే ఎక్కువ, మళ్ళీ ఎందుకు ఈ సిరీస్ అని గతంలోనే పలువురు విమర్శలు చేసారు. అయితే తాజాగా నెట్ ఫ్లిక్స్ రానా నాయుడు 2 షూటింగ్ మొదలుపెట్టింది. షూటింగ్ నుంచి ఓ చిన్న వీడియో క్లిప్ ని అధికారికంగా రిలీజ్ చేసి రానా నాయుడు 2 షూటింగ్ జరుగుతుందని ప్రకటించారు.
Also Read : Actor Surya birthday : అన్నయ్యకు తమ్ముడి స్పెషల్ విషెస్.. ‘నువ్వు సున్నా నుంచి మొదలుపెట్టినా..’
రానా నాయుడు సిరీస్ లోనే బోల్డంత అడల్ట్ కంటెంట్ ఉంది. ఇక ఈ సీజన్ లో ఇంకెంత అడల్ట్ కంటెంట్ చూపిస్తారో అని పలువురు విమర్శలు చేస్తుంటే సిరీస్ నచ్చిన వాళ్ళు రానా నాయుడు 2 సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాబాయ్ అబ్బాయి ఈ సారి ఏ రేంజ్ లో విజృంభిస్తారో చూడాలి.