Actor Surya birthday : అన్న‌య్యకు త‌మ్ముడి స్పెష‌ల్ విషెస్‌.. ‘నువ్వు సున్నా నుంచి మొద‌లుపెట్టినా..’

త‌మిళ స్టార్ హీరో సూర్యను ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు.

Actor Surya birthday : అన్న‌య్యకు త‌మ్ముడి స్పెష‌ల్ విషెస్‌.. ‘నువ్వు సున్నా నుంచి మొద‌లుపెట్టినా..’

Actor Surya birthday Karti wishes his brother a happy birthday

Updated On : July 23, 2024 / 10:55 AM IST

Actor Surya : త‌మిళ స్టార్ హీరో సూర్యను ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. గ‌జినీ వంటి ఎన్నో అద్భుత‌మైన సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లోనూ చెద‌ర‌ని ముద్ర వేశాడు. నేడు (జూలై 23) ఆయ‌న పుట్టిన రోజు. 49వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన సంద‌ర్భంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా సెల‌బ్రిటీలు, అభిమానులు సూర్య‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో సూర్యకు ఆయ‌న త‌మ్ముడు, న‌టుడు కార్తీ బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేశారు.

‘సున్నా నుంచి మొదలు పెట్టినా పర్వాలేదు.. ఏదైనా నేర్చుకుని, కష్టపడి, అంకితభావంతో ఉంటే ఏదైనా సాధించవచ్చని చూపించిన నీకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ సమాజంలో ప్రేమను పంచే మా అభిమానులకు మేము మా ప్రేమను అందిస్తున్నాము.’ అంటూ ఎక్స్‌లో అన్న‌య్య‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేసి రాసుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

Kalki Vs RRR : నార్త్‌లో RRR రికార్డుని బద్దలుకొట్టిన కల్కి.. బాలీవుడ్‌లో ప్రభాస్ సత్తా..

ఇదిలా ఉంటే.. కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో సూర్య ఓ సినిమాలో న‌టిస్తున్నారు. #suriya44 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. సూర్య పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ చిత్ర బృందం గ్లింప్స్‌ను విడుద‌ల చేసింది. ఈ గ్లింప్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

Samantha Rejected Role: సమంతను భయపెట్టిన ఆ పాత్ర ఏంటి?

పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకం పై ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. జోజు జార్జ్‌, జయరామ్ లు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు స‌న్నాహ‌కాలు చేస్తున్నారు.