Samantha Rejected Role: సమంతను భయపెట్టిన ఆ పాత్ర ఏంటి?

ఆ హీరోతో హీరోయిన్‌గా జతకట్టిన సమంత వదిన పాత్రలో కనిపిస్తే ఫ్యాన్స్‌..

Samantha Rejected Role: సమంతను భయపెట్టిన ఆ పాత్ర ఏంటి?

బ్యూటీ క్వీన్‌ సమంత కొత్త రోల్‌ పోషించబోతోందా? తన అందం.. అభినయంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన సమంత.. తెలుగు, తమిళ్‌, హిందీ సినిమాల్లో దుమ్ము రేపింది… ఇక ఓ పెద్ద బ్యానర్‌లో కొత్త రోల్‌ చేయమని ఆఫర్‌ వస్తే…. నేనా.. ఇప్పట్లోనా… అలాంటి పాత్రలా అన్నదట… సమంతను భయపెట్టిన ఆ పాత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం….

బ్యూటీ క్వీన్‌ సమంత సినీ కెరీర్ ప్రారంభించి దాదాపు 15 ఏళ్లు అవుతోంది. మంచి ఫాంలో ఉన్నప్పుడే డైవర్స్… ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధితో కొన్నాళ్లు పాటు సినిమాలకు దూరమైన సమంత… కోలుకున్న తర్వాత యాక్టింగ్‌ కంటిన్యూ చేస్తోంది. అనారోగ్యం నుంచి కోలుకున్నాక ఖుషి సినిమా చేసినా… ఆశించిన స్థాయిలో ఆ సినిమా ఆడలేదు.

దీంతో మరికొన్నాళ్లు స్ర్కిన్‌కు దూరం అవ్వాల్సివచ్చింది. అయితే మధ్యలో బాలీవుడ్‌లో సిటాడెల్ సిరీస్‌ని పూర్తి చేసింది. ఈ మధ్యనే తన సొంత బ్యానర్‌లో బంగారం సినిమా ప్రకటించింది. ఐతే ఇటీవల టాలీవుడ్‌లో ఓ సినిమాలో ఇంపార్టెంట్‌ రోల్‌ చేయాల్సిందిగా వచ్చిన ఆఫర్‌ను సమంత తిరస్కరించందనే సమాచారం హాట్‌టాపిక్‌గా మారింది.

నిర్మాతగానూ మారిన సమంత
ఒకవైపు నటనను కొనసాగిస్తూనే నిర్మాతగా మారిన సమంత… బాలీవుడ్, మాళీవుడ్‌ల్లో సినిమాలకు ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. బాలీవుడ్‌ వెబ్ సిరీస్ మేకర్స్ రాజ్ అండ్ డీకేలతో సమంత కాంబో మారోసారి రాబోతోందని తెలుస్తోంది.. ఇదేసమయంలో మలయాళంలో మమ్ముటితో సినిమా చేస్తుందని టాక్‌ వినిపిస్తోంది.

ఐతే ఈ సినిమా ఓపినింగ్‌లో సమంత లేకపోవటంతో ఆమె పాత్రపై సస్పెన్స్‌ ఏర్పడింది. ఇదిలాఉంటే సమంతకు టాలీవుడ్‌లో ఓ పెద్ద బ్యానర్‌లో ఆఫర్ వచ్చినట్టు టాక్.. కాకపోతే హీరోయిన్‌గా కాకుండా, వదిన పాత్రలో నటించాలని ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ సినిమా హీరోతో గతంలో సమంత హీరోయిన్‌గా జతకట్టిందట.. ఇప్పుడు అదే హీరోకి వదినగా ఆఫర్ రావటంతో సమంత వెంటనే నో చెప్పేసిందంటున్నారు.

ఆ హీరోతో హీరోయిన్‌గా జతకట్టిన సమంత వదిన పాత్రలో కనిపిస్తే ఫ్యాన్స్‌ సరిగా రిసీవ్‌ చేసుకోలేరనే కారణంతో.. ఆఫర్‌ను వదులుకున్నట్లు చెబుతున్నారు. అయినా సమంత లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తా కానీ…. వదిన, అక్కా వంటి పాత్రాలు మాత్రం ఇప్పట్లో అసలు చేయనని… అవసరమైతే ఖాళీగా ఉంటా అంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసినట్లు ఏదైనా పెద్ద సినిమాలకు ఓకే చెబుతుందో లేక అవి కూడా చేయనంటుందా అనేది చూడాలి. మొత్తానికి సమంతా హీరోయిన్ మాత్రమే.. మిగాతా రోల్స్‌ ఇప్పట్లో లేనట్టేనంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

Harish Shankar : ఇదే మీ లాస్ట్ రీమేక్ కావాలి అన్న నెటిజ‌న్‌.. ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ సమాధానం అదుర్స్‌..