Kalki Vs RRR : నార్త్‌లో RRR రికార్డుని బద్దలుకొట్టిన కల్కి.. బాలీవుడ్‌లో ప్రభాస్ సత్తా..

కల్కి సినిమా బాలీవుడ్ లో RRR రికార్డ్ ని బద్దలు కొట్టింది.

Kalki Vs RRR : నార్త్‌లో RRR రికార్డుని బద్దలుకొట్టిన కల్కి.. బాలీవుడ్‌లో ప్రభాస్ సత్తా..

Prabhas Kalki 2898 AD Movie Beats Ram Charan NTR's RRR Movie Record in North

Kalki Vs RRR : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కల్కి సినిమా భారీ విజయం సాధించి థియేటర్స్ లో 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. కలెక్షన్స్ విషయంలో కల్కి సినిమా ఇప్పటికే పలు రికార్డులని బద్దలు కొట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. కల్కి సినిమాతో పాటు ప్రభాస్ పేరిట మీద కూడా పలు రికార్డులు నమోదవుతున్నాయి.

ఇప్పటికే రెండు సినిమాలు 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఏకైక సౌత్ హీరోగా ప్రభాస్ నిలిచాడు. బాహుబలి 2 తర్వాత కల్కి సినిమా 1000 కోట్లు సాధించింది. అమెరికాలో కూడా ఒక్క బాహుబలి 2 రికార్డ్ తప్ప అన్ని రికార్డులని కొల్లగొట్టింది కల్కి. ఇక నార్త్ లో కూడా కల్కి సినిమా భారీ విజయం సాధించింది. కల్కి సినిమా కేవలం నార్త్ లోనే ఇప్పటివరకు 277 కోట్ల గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది.

Also Read : Kalki Part 2 : వాట్.. చిట్టీలు వేసి కల్కి పార్ట్ 2 తీద్దామని డిసైడ్ అయ్యారా? ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు..

దీంతో కల్కి సినిమా బాలీవుడ్ లో RRR రికార్డ్ ని బద్దలు కొట్టింది. RRR సినిమా నార్త్ లో లైఫ్ టైం కలెక్షన్స్ 273 కోట్ల గ్రాస్ సాధించింది. ఇప్పుడు కల్కి సినిమా ఆ రికార్డుని బ్రేక్ చేసింది. ఇప్పటికి 277 కోట్లు కాగా ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయితే నార్త్ లో ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసిన సౌత్ సినిమాల లిస్ట్ లో మాత్రం కల్కి మూడో స్థానంలో ఉంది.

బాహుబలి 2 సినిమా నార్త్ లో 511 కోట్లతో మొదటి స్థానంలో నిలవగా KGF2 సినిమా 434 కోట్లతో రెండో స్థానంలో ఉండగా ఇప్పుడు కల్కి 277 కోట్లతో మూడో ప్లేస్ లో నిలిచింది. దీంతో ఇన్నాళ్లు మూడో ప్లేస్ లో ఉన్న RRR సినిమా 273 కోట్లతో నాలుగో స్థానంకు వెళ్ళింది. ఈ రికార్డులపై ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.