Best Pulse Oximeters India : ఇండియాలో రూ.1500 లోపు బెస్ట్ పల్స్ ఆక్సిమీటర్లు..

Best 3 Pulse Oximeters in India : భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా బాధితులతో ఆస్పత్రలన్నీ నిండిపోతున్నాయి. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత, బెడ్ల కొరత ఇబ్బందిగా మారింది. కరోనా సోకినవారిలో చాలామందిలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కరోనా సోకిన బాధితులు ఆస్పత్రుల్లో చేరాలంటే ఎంతస్థాయిలో ఆక్సిజన్ లెవల్స్ ఉండాలో తప్పక అవగాహన ఉండాలంటున్నారు నిపుణులు.

ఇంటివద్దే ఆక్సిజన్ లెవల్స్ చెక్ చేసుకుని అత్యవసర సమయాల్లో మాత్రమే ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. కరోనా పరిస్థితుల్లో చాలామంది ఇంట్లోనే ఆక్సిమీటర్లు కొనేసి పెట్టుకున్నారు. దాంతో ఇప్పుడు ఈ ఆక్సిమీటర్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. కరోనా లక్షణాలు లేదా వైరస్ నిర్ధారణ అయిన బాధితులంతా పల్స్ ఆక్సిమీటర్ ద్వారా తమ ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడూ చెక్ చేసుకుంటున్నారు. క్యారీబుల్ డివైజ్ మాదిరిగా ఉండే ఈ పల్స్ ఆక్సిమీటర్ ద్వారా ఆక్సిజన్‌లో బ్లడ్ లెవల్ స్థాయిలను చెక్ చేసుకోవచ్చు. క్లిప్ మాదిరిగా ఉండే భాగంలో చేతివేలి ఉంచి ప్లస్ రేటు లెక్కించాలి. ఆక్సిజన్ శాచురేషన్ హెమోగ్లోబిన్ ఎంత ఉందో రీడింగ్ చూడాలి.

నార్మల్ రీడింగ్స్ ఆక్సిజన్ శాచురేషన్ రేంజ్ 95 నుంచి 100శాతం మధ్య ఉండాలి. 94 కంటే తక్కువగా ఉంటే వెంటనే వైద్య సాయం తీసుకోవాలి. పల్స్ ఆక్సిమీటర్ రీడింగ్ చెక్ చేసే సమయంలో 10 సెకన్ల పాటు రిలాక్స్ ఉండాలి. ఎలాంటి టెన్షన్ పెట్టుకోకూడదు. లేదంటే.. రీడింగ్ తప్పుగా చూపిస్తుంది. ఆక్సిజన్ లెవల్స్ తగ్గినట్టుగా రీడింగ్ చూపిస్తుంది. కొంచెం గ్యాప్ ఇస్తూ ఐదుసార్లు పల్స్ రీడింగ్ చెక్ చేసుకోండి.. ఎక్కువసార్లు 94 కంటే తక్కువగా చూపిస్తే వైద్య సాయం పొందండి.. 95 నుంచి 100 లోపు ఉంటే నార్మల్ గా ఉందని అర్థం.. ప్రస్తుతం భారత మార్కెట్లో పల్స్ ఆక్సిమీటర్లు పలు బ్రాండ్లలో తక్కువ ధర రూ.500 నుంచి రూ.5వేల వరకు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో రూ.1500 లోపు ఉన్న పలు బ్రాండ్లకు సంబంధించి టాప్ 3 పల్స్ ఆక్సిమీటర్ల జాబితా మీకోసం..

1. Oplus B05 Finger Tip Pulse Oximeter at Rs 1,400
ఈ ఫింగర్ టిప్ పల్స్ ఆక్సిమీటర్ ద్వారా బ్లడ్ ఆక్సిజన్ స్థాయిలను రీడ్ చేయొచ్చు. ఇందులో ఒక బటన్ ఆపరేషన్ ఫీచర్ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆక్సిమీటర్ ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే అందుబాటులో ఉంది.

2.MEDITIVE Fingertip Pulse Oximeter at Rs 1390
ఈ డివైజ్ కూడా పల్స్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ స్థాయిలను రీడ్ చేస్తుంది. ఇది OLED డిస్ ప్లేతో పనిచేస్తుంది. ఈ-రిటైల్ ప్లాట్ ఫ్లాంలపై కూడా ఫింగర్ టిప్ పల్స్ ఆక్సిమీటర్ అందుబాటులో ఉంది. దీని ధర మార్కెట్లో రూ.1390 నుంచి లభ్యమవుతోంది.

3.Dr. Morepen PO-15 Pulse Oximeter at Rs 1,130
ఈ ఆక్సిమీటర్ డ్యుయల్ డైరెక్షనల్ OLED డిస్ ప్లేతో వచ్చింది. డివైజ్ లో పల్స్ రేటుతో పాటు బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్ కూడా తెలుసుకోవచ్చు. పల్స్ రేటు రేంజ్ సాధారణంగా 30bpm నుంచి 235bpm మధ్య ఉండాలి. ఈ డివైజ్ లో మొత్తం ఆరు డిస్ ప్లే మోడ్స్ ఉన్నాయి. ఒక ఏడాది పాటు వారంటీ పొందవచ్చు.

ట్రెండింగ్ వార్తలు