Germicidal Smart Fan : మీ ఇంట్లో.. ఈ స్మార్ట్ ఫ్యాన్‌ ఉంటే చాలు.. వ్యాధికారక క్రిములు మాయం!

ఇంట్లో కంటికి కనిపించని వ్యాధికారిక క్రిములను నివారించేందుకు కొత్త టెక్నాలజీతో స్మార్ట్ ఫ్యాన్ ఒకటి వచ్చింది. అదే.. (Germicidal Smart Fan). ఈ స్మార్ట్ ఫ్యాన్ మీ ఇంట్లో ఉంటే.. ఎలాంటి వ్యాధికారిక క్రిములైన ఇట్టే మాయం చేసేస్తుంది.

Germicidal Smart Fan : అసలే కరోనా కాలం.. అందులోనూ వర్షాకాలం.. వ్యాధులు ముదిరే కాలామాయే.. మహమ్మారేమో ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ఈ పరిస్థితుల్లో వ్యాధుల బారినపడకుండా ఉండాలంటే ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కూడా. బయటకు వెళ్తే ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో ఇంట్లో కూడా అలానే ఉండాలంటున్నారు నిపుణులు. అయితే.. ఇంట్లో కంటికి కనిపించని సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు, ఫంగస్ వంటి వ్యాధికారిక క్రిములు పొంచి ఉంటాయి. అందుకే అలాంటి వ్యాధికారిక క్రిములను ఇంట్లోనే నివారించేందుకు కొత్త టెక్నాలజీతో స్మార్ట్ ఫ్యాన్  ఒకటి వచ్చింది. అదే.. (Germicidal Smart Fan). ఈ స్మార్ట్ ఫ్యాన్ మీ ఇంట్లో ఉంటే.. ఎలాంటి వ్యాధికారిక క్రిములైన ఇట్టే మాయం చేసేస్తుంది.

ప్రత్యేకించి వ్యాధికారిక క్రిములను నాశనం చేసేందుకు అల్ట్రా జెర్మిసిడాల్ అనే స్మార్ట్ ఫ్యాన్ ను డిజైన్ చేసింది మోడ్రాన్ ఫామ్స్ అనే సంస్థ. వాస్తవానికి సీలింగ్ ఫ్యాన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ కనిపెట్టలేదంటున్నారు మోడ్రాన్ ఫామ్స్, WAC సంస్థ కో-సీఈఓ Dirk Wald పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు సీలింగ్ మార్కెట్లో కూడా కొత్త రకం టెక్నాలజీ కలిగిన ఈ స్మార్ట్ ఫ్యాన్ వినియోగంలోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలిపారు. (Ultra Germicidal Smart Fan) స్మార్ట్ ఫ్యాన్.. పేటెంట్ పెండింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. దీనిద్వారా అల్ట్రావయోలెట్-C LED మాడ్యుల్‌తో కలిసి ఉంటుంది.

దాంతో సీలింగ్ ఫ్యాన్ మాదిరిగా తిరుగుతుంది. తద్వారా ఇంట్లోని గదిలో అన్నివైపులా గాలి వస్తుంది. అప్పుడు గాలిలో కంటికి కనిపించని వ్యాధికారక క్రిములను నివారించగలదని కంపెనీ చెబుతోంది. ఇప్పటికే (American Pathologists) అమెరికాకు చెందిన పాథాలజిస్ట్ నిపుణులు (Clinical Laboratory Improvement Amendments accredited lab)తో కలిసి సంయుక్తంగా ఈ స్మార్ట్ ఫ్యాన్ పనితీరును పరీక్షించారు. ఈ ఫలితాల్లో ఈ స్మార్ట్ ఫ్యాన్ తిరిగినప్పుడు.. 30 నిమిషాల తర్వాత గది గాల్లోని వ్యాధికారిక క్రీములను 99.99 శాతం మేర అంతం చేసినట్టు గుర్తించారు.

ఈ అల్ట్రా డిజైనర్ సీలింగ్ ఫ్యాన్.. 54 అంగుళాల సైజు ఉంటుంది. సాధారణ ఫ్యాన్ లానే మూడు రెక్కలు ఉంటాయి. నల్లని బ్లేడ్ లు ఉంటాయి. అలాగే స్టెయిన్ లెస్ స్టీల్ హార్డ్ వేర్, ABS బ్లేడులను కలిగి ఉంది. ఔట్ డోర్ లలో కూడా ఈ స్మార్ట్ ఫ్యాన్ పనిచేస్తుంది. ఇందులో బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది. హ్యాండ్ రిమోట్ కంట్రోల్ ద్వారా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు. గాలి దశను కూడా మార్చుకోవచ్చు. Modren Forms యాప్ ద్వారా కూడా ఈ ఫ్యాన్ ఆపరేటింగ్ చేయొచ్చు. అలాగే షెడ్యూల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే.. స్మార్ట్ హోం డివైజ్ లకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు