SBI Jan Dhan Yojana : కస్టమర్లకు అలర్ట్… జన్‌ధన్‌ అకౌంట్ ఉందా? రూ.2 లక్షల వరకు ఉచిత బీమా సౌకర్యం..

ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌బీఐ (SBI) తమ కస్టమర్ల కోసం మరిన్ని ప్రయోజనాలు అందిస్తోంది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (Pradhan Mantri Jan Dhan Yojana) పథకంలో భాగంగా అకౌంట్ తెరిచిన వారికి ముఖ్యంగా ఈ ప్రయోజనాన్ని అందిస్తోంది.

SBI Jan Dhan Yojana : ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌బీఐ (SBI) తమ కస్టమర్ల కోసం మరిన్ని ప్రయోజనాలు అందిస్తోంది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (Pradhan Mantri Jan Dhan Yojana) పథకంలో భాగంగా అకౌంట్ తెరిచిన వారికి ముఖ్యంగా ఈ ప్రయోజనాన్ని అందిస్తోంది. ఎస్‌బీఐలో అకౌంట్ ఉండి.. ఎస్‌బీఐ రూపే డెబిట్‌ కార్డు కలిగిన అన్ని జన్‌ధన్‌ అకౌంట్లకు రూ.2 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా కవరేజ్‌ అఫర్ చేస్తోంది. 2014లో ప్రధాన్‌ మంత్రి జన్‌ ధన్‌ యోజన స్కీమ్ ప్రారంభమైంది. ఈ స్కీమ్ ద్వారా SBI రూపే జన్ ధన్ కార్డును జన్ ధన్ అకౌంట్ దారులకు అందిస్తోంది. ఈ కార్డు సంబంధిత కస్టమర్లను రూ.2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. రూపే కార్డ్ సాయంతో మీ అకౌంట్ నుంచి డబ్బు డ్రాతో పాటు షాపింగ్స్ కూడా చేసుకునే సదుపాయం ఉంది.

జన్ ధన్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే.. మీకు దగ్గరలోని బ్యాంకుకు వెళ్లండి.. జనధన్ అప్లికేషన్ తీసుకుని మీ వివరాలను నింపండి. మీ పేరు, మొబైల్ నంబర్, అడ్రస్, వ్యాపారం, ఉపాధి, వార్షిక ఆదాయం, కుటుంబ సభ్యుల సంఖ్య, నామిని వంటి వివరాలను నమోదు చేయాలి. అవసరమైతే బ్యాంకు సిబ్బంది సాయం కూడా తీసుకోవచ్చు. 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఈ అకౌంట్ తెరవచ్చు. ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ తోపాటు KYC సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. జన్ ధన్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కరోనా పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో కూడా ఓపెన్‌ చేసుకునే సౌకర్యం ఉంది. జన్‌ధన్‌ అకౌంట్లపై జారీ చేసిన రూపే కార్డులకు ప్రమాద బీమా రూ. 2 లక్షల వరకు వస్తుంది. ఈ ప్రమాద బీమా పొందేటప్పుడు అవరమైన డాక్యుమెంట్లు సమర్పించడం ద్వారా క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఈ మొత్తం నామినీకి అందించడం జరుగుతుంది.

అవసరమైన డాక్యుమెంట్లలో ముఖ్యంగా క్లెయిమ్ చేసుకునే డాక్యుమెంట్ పై సంతకం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే మరణ ధృవీకరణ పత్రాన్ని కూడా జత చేయాలి. ప్రమాదం గురించి వివరణ ఇచ్చే పోలీసు స్టేషన్‌ ఎఫ్‌ఐఆర్‌ కాపీ కూడా ఉండాలి. మరణం తర్వాత పోస్టుమార్టం నివేదిక పత్రాన్ని కూడా జత చేయాలి. కార్డుదారునికి నామినీగా ఉన్న వ్యక్తి ఆధార్‌ కాపీని కూడా జత చేయాలి.

జన్‌ధన్‌ కార్డు జారీ చేసిన బ్యాంకు నుంచి అధికారికంగా సంతకం చేసిన డాక్యుమెంట్ కూడా ఉండాలి. అకౌంట్ సంబంధిత రూపే కార్డు నెంబర్‌ కూడా తప్పనిసరిగా ఉండాలి. నామినీ పేరుపై బ్యాంకు వివరాలను కూడా జత చేయాలి. ఈ డాక్యుమెంట్లు సమర్పించిన తేదీ నుంచి 10 రోజుల్లో క్లెయిమ్‌ చేసుకునే అవకాశం ఉంది. మార్చి 31, 2022 వరకు ప్రయోజనాలు పొందవచ్చు.

ట్రెండింగ్ వార్తలు