Bhadrachalam Seetharamula Kalyanam : సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి

దాదాపుగా 40ఏళ్లుగా ప్రత్యక్ష ప్రసారం జరుగుతోందని, ఈ ఒక్క దానికి ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని లేఖలో కోరారు.

Bhadrachalam Seetharamula Kalyanam : ఎట్టకేలకు భద్రాద్రి రాములోరి కల్యాణం లైవ్ టెలికాస్ట్ కు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నియమావళికి అనుగుణంగా నిర్వహించాలని ఆదేశించింది. ఇటీవల భద్రాచలం సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారంపైన ఈసీ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల వేళ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి వీల్లేదని సూచించింది.

అయితే, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సీఈవోకి లేఖ రాసింది. దాదాపుగా 40ఏళ్లుగా ప్రత్యక్ష ప్రసారం జరుగుతోందని, ఈ ఒక్క దానికి ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని లేఖలో కోరారు. దీనిపై ఈసీ స్పందించింది. నిబంధనలు ఉల్లంఘించకుండా జరుపుకోవాలని తాజాగా రాములోరి కల్యాణం లైవ్ టెలికాస్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రేపు భద్రాద్రి రామయ్యకు సీఎస్ శాంతి కుమారి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Also Read : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈనెల 18న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

ట్రెండింగ్ వార్తలు