Man dies while dancing: డ్యాన్స్ చేస్తూ మృతి చెందిన వ్యక్తి.. వీడియో వైరల్

గార్బా డ్యాన్స్ చేస్తూ ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నాడు ఓ వ్యక్తి. ఇంతలో కార్డియాక్ అరెస్ట్ రూపంలో అతడిని మృత్యువు చుట్టుముట్టింది. డ్యాన్స్ చేస్తూనే మధ్యలో కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఒకరు స్మార్ట్ ఫోనులో తీశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Man dies while dancing: గార్బా డ్యాన్స్ చేస్తూ ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నాడు ఓ వ్యక్తి. ఇంతలో కార్డియాక్ అరెస్ట్ రూపంలో అతడిని మృత్యువు చుట్టుముట్టింది. డ్యాన్స్ చేస్తూనే మధ్యలో కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఒకరు స్మార్ట్ ఫోనులో తీశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విరార్ పట్టణంలోని గ్లోబల్ సిటీ కాంప్లెక్స్ లో తాజాగా గార్బా కార్యక్రమం నిర్వహించారు.

అందులో కొందరు యువకులు ఉత్సాహంగా సంప్రదాయ గార్బా నృత్యం చేస్తున్నారు. ఆ సమయంలోనే మనీశ్ (35) అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో మనీశ్ ను వెంటనే అతడి తండ్రి నారప్పజీ సోనిగ్రా (66) ఆసుపత్రికి తరలించారు. అయితే, మనీశ్ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. ఈ వార్త వినగానే మనీశ్ తండ్రి నారప్పజీ కూడా అక్కడి కుప్పకూలి ప్రాణాలు విడిచారు.

తండ్రీకొడుకుల ఇద్దరు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని పోలీసులు వివరించారు. వారిద్దరు ప్రమాదవశాత్తూ మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని అన్నారు. ఆరోగ్యవంతంగా ఉన్న వారిలోనూ ఆకస్మికంగా కార్డియాక్ అరెస్ట్ తలెత్తుతున్న ఘటనలు దేశంలో తరుచూ చోటు చేసుకుంటుండడం ఆందోళన కలిగిస్తోంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు