Raayan : రావ‌ణుడిగా ధ‌నుష్‌..? రాయ‌న్ రిలీజ్ ఎప్పుడంటే?

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు.

Raayan Release date : కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల్లో ఆయ‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న మూవీ ‘రాయ‌న్‌’. ధ‌నుష్ కెరీర్‌లో 50వ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ సినిమా పై క్యూరియాసిటీని పెంచింది. తాజాగా సినిమా నుంచి ఓ రెండు సాలీడ్ అప్‌డేట్‌ల‌ను చిత్ర‌బృందం ఇచ్చింది.

ఈ చిత్రాన్ని జూన్ 13న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టి నుంచే ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లు పెట్టింది. అందులో భాగంగా ఈ మూవీలోని తొలి పాట‌ను మే 9 విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ విష‌యాల‌ను తెలియ‌జేస్తూ ఓ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

Prabhas : కావాలని ప్రభాస్ పై నెగిటివ్ ప్రచారం చేస్తున్న కొంతమంది..? ఎవరు.. ఎందుకు?

ఈ పోస్ట‌ర్‌లో ధ‌నుష్ బ్లాక్ పాయింట్‌, బ్లాక్ ష‌ర్టు ధ‌రించి ఇటుక‌ల‌పై కూర్చొని ఉండ‌గా ఇటుక‌ల‌కు ప‌క్క‌న మంట‌లు అంటుకుని ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్‌లో రావ‌ణుడి పోస్ట‌ర్ ఉంది. ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ సినిమాలో అప‌ర్ణ బాల‌ముర‌ళి, దుషారా విజ‌య‌న్ లు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, విష్ణువిశాల్‌, కాళిదాస్ జయరామన్‌, సందీప్ కిషన్‌, సెల్వ రాఘవన్‌, ఎస్‌జే సూర్య కీలక పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై క‌ళానిధి మార‌న్ ఈ సినిమాని నిర్మిస్తోండ‌గా ఏ ఆర్ రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

VN Aditya : అల్లు అర్జున్ యంగర్ చిరంజీవి.. అలాంటివి చేయాలంటే ఆయన తర్వాత బన్నీనే..

ట్రెండింగ్ వార్తలు