VN Aditya : అల్లు అర్జున్ యంగర్ చిరంజీవి.. అలాంటివి చేయాలంటే ఆయన తర్వాత బన్నీనే..
తాజాగా ఓ దర్శకుడు చిరంజీవి, అల్లు అర్జున్ లను పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Director VN Aditya Interesting Comments while comparing Chiranjeevi and Allu Arjun
VN Aditya : అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ ఫేమస్. పుష్ప సినిమాతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు బన్నీ. ఇప్పటివరకు ఏ తెలుగు హీరో సాధించని నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు అల్లు అర్జున్. నటన, డ్యాన్సులు, ఫైట్స్.. అన్ని విషయాల్లో అల్లు అర్జున్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. సినిమా సినిమాకి తనని తాను మార్చుకుంటూ కొత్తగా ప్రేక్షకులని పలకరిస్తున్నాడు.
ఇక అల్లు అర్జున్ చిరంజీవికి(Chiranjeevi) పెద్ద ఫ్యాన్ అని తెలిసిందే. కట్టే కాలే వరకు చిరంజీవి అభిమానినే అని అల్లు అర్జున్ స్వయంగా ఓ ఈవెంట్లో చెప్పాడు. అల్లు అర్జున్ చిరంజీవితో కలిసి మూడు సినిమాల్లో కనిపించాడు కూడా. తాజాగా ఓ దర్శకుడు చిరంజీవి, అల్లు అర్జున్ లను పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనసంతా నువ్వే, నేనున్నాను, ఆట.. లాంటి మంచి సినిమాలు అందించిన దర్శకుడు VN ఆదిత్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
Also Read : Anupama Parameswaran : విక్రమ్ తనయుడితో అనుపమ పరమేశ్వరన్.. సినిమా టైటిల్ అనౌన్స్..
ఈ ఇంటర్వ్యూలో VN ఆదిత్య తాను చిరంజీవి అభిమాని అని, ఆయనతో సినిమా తీయాలని ఉందని అన్నారు. అయితే ఇప్పటి హీరోల్లో ఎవరితో సినిమా తీస్తారు, ఎవరంటే ఇష్టం అని అడగ్గా VN ఆదిత్య సమాధానమిస్తూ.. అల్లు అర్జున్ అంటే ఇష్టం. చిరంజీవికి అల్లు అర్జున్ యంగర్ వర్షన్ లా కనిపిస్తారు. చిరంజీవి ఘరానా మొగుడు, యముడికి మొగుడు లాంటి సినిమాల్లో ఓ టీజింగ్ డ్రామా ఉంటుంది. అలాంటిది చేయాలంటే అల్లు అర్జున్ చేయాలి. అతనిలో మంచి ఈజ్ ఉంటుంది అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా బన్నీ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.