Prabhas : కావాలని ప్రభాస్ పై నెగిటివ్ ప్రచారం చేస్తున్న కొంతమంది..? ఎవరు.. ఎందుకు?

ప్రభాస్ సినిమా ఎలాంటి టాక్ వచ్చినా ఓపెనింగ్ రిలీజ్ రోజు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడుతుంది.

Prabhas : కావాలని ప్రభాస్ పై నెగిటివ్ ప్రచారం చేస్తున్న కొంతమంది..? ఎవరు.. ఎందుకు?

prabhas

Prabhas : బాహుబలి(Bahubali) సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. తెలుగు, సౌత్, నార్త్ అని కాకుండా దేశమంతా ప్రభాస్ అభిమానులు ఏర్పడ్డారు. జపాన్, మలేషియా.. లాంటి చాలా దేశాల్లో కూడా ప్రభాస్ కి అభిమానులు ఉన్నారు. అసలు చెప్పాలంటే ప్రభాస్ బాహుబలి సినిమాతోనే తెలుగు పరిశ్రమకి ఇండియా వైడ్, వరల్డ్ వైడ్ ఒక మంచి గుర్తింపు వచ్చింది. అక్కడనుంచే మన తెలుగు పరిశ్రమ ఎదుగుతూ వస్తుంది.

బాహుబలి ఊహించని విధంగా భారీ హిట్ అవ్వడంతో అభిమానులు, ప్రేక్షకులు అందరూ కూడా ప్రభాస్ నుంచి వచ్చే సినిమాలపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే బాహుబలి 2 తర్వాత వచ్చిన సినిమాలు భారీ కలెక్షన్స్ తెచ్చినా అభిమానులు సంతృప్తి పడలేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి ఇప్పటివరకు సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్(Salaar) సినిమాలు వచ్చాయి. వీటిల్లో రాధేశ్యామ్, ఆదిపురుష్ మాత్రమే కమర్షియల్ గా కొద్దిగా వర్కౌట్ అవ్వలేదు. కానీ టాక్ పరంగా ఈ సినిమాలు కూడా బానే ఉన్నాయి.

Also Read : Anupama Parameswaran : ‘లాక్ డౌన్’లో అనుపమ పరమేశ్వరన్.. ఫుల్ ఫామ్‌లో ఉందిగా అనుపమ..

ఇక సలార్ అయితే భారీ హిట్ కొట్టి 700 కోట్లు సాధించింది. అసలు ప్రభాస్ సినిమా ఎలాంటి టాక్ వచ్చినా ఓపెనింగ్ రిలీజ్ రోజు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడుతుంది దేశమంతా. అయితే ఇటీవల కావాలని కొంతమంది ప్రభాస్ పై, అతని సినిమాలపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. రాధేశ్యామ్ సినిమా బాగున్నా కొంతమంది కావాలని నెగిటివ్ ప్రచారం చేశారు. ఇక సలార్ పెద్ద హిట్ అయినా కూడా ఫ్లాప్ అంటూ టాక్ స్ప్రెడ్ చేశారు. ఇటీవలే సలార్ కి టీవిలో తక్కువ టీఆర్పీ వచ్చింది, ఓటీటీలో కూడా వేరే సినిమాల్లాగే ట్రెండ్ లో లేదు అంటూ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు.

ప్రభాస్ నుంచి వచ్చే ప్రతి సినిమాని కావాలని బాహుబలితో పోలుస్తూ తక్కువ చేసి ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొంతమంది పనిగట్టుకొని ప్రభాస్ సినిమాలపైనే కాకుండా ప్రభాస్ లుక్స్ పై కూడా ట్రోల్స్ చేస్తున్నారు. రాబోయే సినిమాలపై కూడా ఇప్పట్నుంచే విమర్శలు చేస్తున్నారు. అయితే ఇది కేవలం ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ మాత్రమే కాదు, కొంతమంది బాలీవుడ్ వాళ్ళు, ఇక్కడ కూడా ప్రభాస్ అంటే గిట్టని వాళ్ళు కావాలని ప్రభాస్ పై విష ప్రచారం చేస్తున్నారని ప్రభాస్ అభిమానులు, సన్నిహితులు కూడా అంటున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభాస్ అభిమానులు కోరుతున్నారు. సినిమా టాక్ ఎలా ఉన్నా వందల కోట్ల కలెక్షన్స్ తెచ్చే పాన్ ఇండియా హీరోపై ఇలాంటి నెగిటివ్ ప్రచారం తగదు అని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ప్రభాస్ పై ఇలాంటి నెగిటివ్ ప్రచారం ఎవరు చేస్తున్నారో? ఎందుకు చేస్తున్నారో తెలియాలి. వాళ్లెవరో కనుక్కునే పనిలో అభిమానులు ఆల్రెడీ ఉన్నారట.

Also Read : Anupama Parameswaran : ‘లాక్ డౌన్’లో అనుపమ పరమేశ్వరన్.. ఫుల్ ఫామ్‌లో ఉందిగా అనుపమ..

ఇక ప్రస్తుతం ప్రభాస్ వరుస భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ చేతిలో కల్కి 2898AD, సలార్ 2, రాజా సాబ్, స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా.. ఇలా భారీ లైనప్ ఉంది.