Anupama Parameswaran : ‘లాక్ డౌన్’లో అనుపమ పరమేశ్వరన్.. ఫుల్ ఫామ్లో ఉందిగా అనుపమ..
తాజాగా నేడు రెండు సినిమాలు ప్రకటించింది అనుపమ.
- Saketh U
- Updated on- May 6, 2024 / 05:53 PM IST
Anupama Parameswaran announced another new Film Titled as Lock Down Poster goes Viral
Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. ఈగల్, టిల్లు స్క్వేర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు ప్రకటిస్తుంది అనుపమ. ఇటీవలే ‘పరదా’ అనే ఓ ఆసక్తికర టైటిల్ తో సినిమా అనౌన్స్ చేసింది. పరదా సినిమా తెలుగు, తమిళ్ లో రిలీజ్ కానుంది. తాజాగా నేడు రెండు సినిమాలు ప్రకటించింది.
తమిళ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్(Dhruv Vikram) సరసన అనుపమ హీరోయిన్ గా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ‘బైసన్’ అనే సినిమాని నేడు ప్రకటించారు. తాజాగా మరో సినిమాని ప్రకటించారు. అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్ లో ‘లాక్ డౌన్'(Lock Down) అనే టైటిల్ తో సినిమాని ప్రకటించారు. తమిళ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో AR జీవా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
Also Read : Anupama Parameswaran : విక్రమ్ తనయుడితో అనుపమ పరమేశ్వరన్.. సినిమా టైటిల్ అనౌన్స్..
తాజాగా టైటిల్ అనౌన్స్ చేస్తూ అనుపమ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో అనుపమ బాధతో అరుస్తున్నట్టు ఉంది. ఈ పోస్టర్ తో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా అని సమాచారం. ప్రస్తుతానికి ఈ సినిమాని తమిళ్ లో మాత్రమే ప్రకటించారు. మరి రిలీజ్ టైంకి తెలుగులో కూడా రిలీజ్ చేస్తారేమో చూడాలి. దీంతో అనుపమ చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నట్టు తెలుస్తుంది.
