ICC Player of the Month award : ఏప్రిల్ నెల‌కు ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుల షార్ట్ లిస్ట్‌..

ఐసీసీ ఏప్రిల్ నెల‌కు గానూ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డుల‌కు నామినేట్ అయిన ఆట‌గాళ్ల వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

ICC Player of the Month : అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఏప్రిల్ నెల‌కు గానూ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డుల‌కు నామినేట్ అయిన ఆట‌గాళ్ల వివ‌రాల‌ను వెల్ల‌డించింది. పురుషుల విభాగంలో పాకిస్తాన్ పేస‌ర్ పేసర్ షహీన్ అఫ్రిది, న‌మీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్, యూఏఈ సార‌థి మ‌హమ్మద్ వసీమ్ లు నామినేట్ అయ్యారు.

అటు మ‌హిళ‌ల విభాగంలో శ్రీలంక‌ కెప్టెన్ చ‌మరి ఆట‌పట్టు, వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్, దక్షిణాఫ్రికా స్టార్ లారా వోల్వార్డ్ట్ లు అవార్డు రేసులో ఉన్నారు. వీరంతా ఏప్రిల్ నెల‌లో అద్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు.

Harshal Patel : ధోని వికెట్ తీసిన త‌రువాత హ‌ర్ష‌ల్ ప‌టేల్ సెల‌బ్రేష‌న్స్ ఎందుకు చేసుకోలేదు..? అస‌లు కార‌ణ‌మిదే? తెలిస్తే సెల్యూట్‌..

న్యూజిలాండ్‌తో స్వ‌దేశంలో జ‌రిగిన టీ20 సిరీస్‌లో షాహీన్ అఫ్రిది అద‌ర‌గొట్టాడు. నాలుగు మ్యాచులు మాత్ర‌మే ఆడిన ష‌హీన్ 8 వికెట్లు తీసి ఈ సిరీస్‌లో లీడింగ్ వికెట్ టేక‌ర్‌గా నిలిచాడు. ఒమ‌న్ ప‌ర్య‌ట‌న‌లో నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ఒమ‌న్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌ను నమీబియా గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఇక యూఏఈ కెప్టెన్ మ‌హ్మ‌ద్ వ‌సీం సైతం ఒమ‌న్ వేదిక‌గా జ‌రిగిన ఏసీసీ ప్రీమియ‌ర్ క‌ప్‌లో దుమ్ములేపాడు. ఏప్రిల్ నెల‌లో 44.83 సగటుతో 269 పరుగులు సాధించాడు.

వ‌న్డేల్లో శ్రీలంక‌ కెప్టెన్ చ‌మరి ఆట‌పట్టు త‌న అద్భుత‌మైన ఫామ్‌ను కొన‌సాగిస్తోంది. ద‌క్షిణాఫ్రికా పై 258 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో 195 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడింది. టీ20 సిరీస్‌లో 148 ప‌రుగులు చేసింది. వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్.. పాకిస్తాన్ జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో రెండు శ‌త‌కాలు, టీ20 సిరీస్‌లో రెండు వ‌రుస అర్ధ‌శ‌త‌కాలను సాధించింది. మొత్తంగా 451 ప‌రుగులు చేసింది. అంతేకాకుండా బౌలింగ్‌లో 12 వికెట్లు తీసింది.

Ravindra Jadeja : జ‌డేజా మామూలోడు కాదుగా..! ధోనినే వెన‌క్కి నెట్టాడు..

దక్షిణాఫ్రికా స్టార్ లారా వోల్వార్డ్ట్ శ్రీలంక‌తో జ‌రిగిన చివ‌రి టీ20లో హాఫ్ సెంచ‌రీ చేసింది. వ‌న్డే సిరీస్‌లోనూ త‌న ఫామ్‌ను కొన‌సాగించింది. తొలి మ్యాచ్‌లో 41 ప‌రుగులు చేసిన లారా వోల్వార్డ్ట్ రెండో వ‌న్డేలో 110 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచింది. ఇక ఆఖ‌రి వ‌న్డేలో 184 ప‌రుగుల ఇన్నింగ్స్‌తో రికార్డు సృష్టించింది.

ట్రెండింగ్ వార్తలు