Anantapur DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు.. విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశం

ఈ క్రమంలో ఆరోపణలు వచ్చిన అధికారులపై ఈసీ నజర్ పెట్టింది. పూర్తిగా ఆధారాలు వచ్చాక అలాంటి అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది.

Anantapur DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశించింది. మరోవైపు అనంతపురం అర్బన్ డీఎస్పీగా టీవీవీ ప్రతాప్ కుమార్, రాయచోటి డీఎస్పీగా రామచంద్రరావును నియమించింది. ఇవాళ రాత్రి 8గంటలలోగా బాధ్యతలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. ఎన్నికల వేళ పోలీసు ఉన్నతాధికారులపై ఈసీ నిఘా పెట్టింది.

ఎన్నికల సంఘానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారా? లేక పార్టీలకు అనుబంధంగా వ్యవహరిస్తున్నారా? అని చెక్ చేస్తోంది. ఈ క్రమంలో ఆరోపణలు వచ్చిన అధికారులపై ఈసీ నజర్ పెట్టింది. పూర్తిగా ఆధారాలు వచ్చాక అలాంటి అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది. వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలని ఏపీ డీజీపీని ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే.

అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. అమ్మిరెడ్డి వైసీపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఆయనపై ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీనిపై పూర్తి స్థాయిలో పరిశీలన జరిపిన ఈసీ.. అమ్మిరెడ్డిపై వేటు వేసింది. ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని చెప్పింది. అటు అనంతపురం, రాయచోటి డీఎస్పీలను కూడా బదిలీ చేసింది.

Also Read : ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ గుప్తా

ట్రెండింగ్ వార్తలు