Puppies Confuse: కోడిపెట్టను తమ తల్లి అనుకున్న కుక్క పిల్లలు.. వీడియో వైరల్

ఓ కోడిపెట్ట కోడిపిల్లలతో కలిసి బుట్టలో ఉంటుంది. అయితే, తన తల్లి అనుకుని ఆ కోడిపెట్ట వద్దకు ఓ కుక్క పిల్ల వెళ్తుంది. వెచ్చదనం కోసం కోడిపెట్ట కింద ఆ కుక్క పిల్ల తలదాచుకుంటుంది. మరో కుక్క పిల్ల కూడా ఆ కోడిపెట్ట వద్ద ఉంటుంది. 10 క్షణాల పాటు ఉన్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Puppies Confuse: ఒత్తిడిలో ఉన్న మనకు సామాజిక మాధ్యమాల్లో కనపడే పలు వీడియోలు ప్రశాంతత కలిగిస్తాయి. అలాగే, జంతువులు, పక్షులు అంటే చాలా మందికి ఇష్టం. వాటిని పెంచుకుంటూ చాలా మంది ప్రశాంతత పొందుతుంటారు. వాటికి సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటారు. ఇటువంటి వీడియోనే ఇప్పుడు మీరు చూడబోతున్నారు.

యోగ్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో ఓ కోడిపెట్ట కోడిపిల్లలతో కలిసి బుట్టలో ఉంటుంది. అయితే, తన తల్లి అనుకుని ఆ కోడిపెట్ట వద్దకు ఓ కుక్క పిల్ల వెళ్తుంది. వెచ్చదనం కోసం కోడిపెట్ట కింద ఆ కుక్క పిల్ల తలదాచుకుంటుంది. మరో కుక్క పిల్ల కూడా ఆ కోడిపెట్ట వద్ద ఉంటుంది. 10 క్షణాల పాటు ఉన్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

తమ తల్లి అనుకుని ఆ కుక్క పిల్లలు కోడిపెట్ట వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ కుక్క పిల్లలను తన పిల్లల్లాగే కోడిపెట్ట చూసుకుంటుండడం గమనార్హం. తల్లి ఎవరికైనా తల్లే అంటూ పలువురు నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్లు చేశారు. ఈ వీడియో చూశాక మనసుకు ప్రశాంతత చేకూరిందని కొందరు పేర్కొన్నారు.

PM Modi: వందే భారత్’​ ఎక్స్​ప్రెస్‎ను ​ప్రారంభించిన మోదీ

ట్రెండింగ్ వార్తలు