Benefits Of Mulching : వ్యవసాయ సాగులో మల్చింగ్ ప్రాధాన్యత, కలిగే లాభాలు

పారదర్శక ఫిల్మ్ ను వేసవిలో భూమిపై పరిచి సూర్యరశ్మిని లోనికి ప్రసరింప చేసి భూమిలోని క్రిమికీటకాదులను తెగుళ్ళను నివారిస్తుంది. ఈ ప్రక్రియను నేల సోలరైజేషన్ అంటారు.

Benefits Of Mulching : మొక్కల చుట్టునేలను ఏదైనా పదార్ధంతో కప్పిపెట్టడాన్ని మల్చింగ్ అంటారు. పూర్వకాలంలో ఈపద్ధతికి వరిపొట్టు , రంపంపొట్టు, చెరకు పిప్పి ఎండిన ఆకులు, చిన్నచిన్న గులకరాళ్ళు మొదలైనవి వాడేవారు. ప్ర్తుతం ప్లాస్టిక్ షీట్ తో మల్చింగ్ వేయటం జరుగుతుంది. ప్లాస్టిక్ షీట్ తో చుట్టూ కప్పి ఉంచటాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అని పిలుస్తారు.

మల్చింగ్ వల్ల లాభాలు ;

నీటి అదా ; మొక్క చుట్టూ భూమిలో ఉండే తేమను ఆవిరి కాకుండా నివారించడం వల్ల వివిధ కాల పరిమితులు గల పంటలకు 40 శాతం నీటి అదా అవుతుంది. తద్వారా పంటలకు నీటి తడులు అదా అవుతాయి.

READ ALSO : Ridge Gourd Cultivation : వేసవి బీరసాగులో మెళకువలు…రైతులు పాటించాల్సిన యాజమాన్యపద్ధతులు

కలుపు నివారణ ; సూర్యరశ్మి నేరుగా కలుపు మొక్కలకు సోకకుండా చేయడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరగక సుమారు 85శాతం వరకు కలుపు నివారణ జరుగుతుంది.

మట్టికోత నివారణ ; వర్షపు నీరు నేరుగా భూమిపై పడకుండా నివారించడం వల్ల మట్టికోతను నివారించి భూసారాన్ని పరిరక్షించవచ్చు.

నేల ఉష్ణోగ్రత నియంత్రణ ; మొక్క చుట్టూ సూక్ష్మ వాతావరణ పరిస్ధితులను కలగజేస్తూ నేల ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తద్వారా నేలలో ఉండే సూక్ష్మ జీవుల చర్య అధికమై నేల నిర్మాణాన్ని వృద్ధి చేస్తూ మొక్కలకు అన్ని పోషక పదార్దాలు అందేలా చేస్తుంది.

భూమిలోని చీడపీడల నివారణ ; పారదర్శక ఫిల్మ్ ను వేసవిలో భూమిపై పరిచి సూర్యరశ్మిని లోనికి ప్రసరింప చేసి భూమిలోని క్రిమికీటకాదులను తెగుళ్ళను నివారిస్తుంది. ఈ ప్రక్రియను నేల సోలరైజేషన్ అంటారు.

READ ALSO : Organic Fertilizers : వ్యవసాయంలో సేంద్రీయ ఎరువుల వినియోగంతో అధిక దిగుబడులతోపాటు, ఖర్చులు తక్కువే!

ఎరువులు, క్రిమిసంహారక మందుల ఆదా ; నేలలో వేసిన ఎరువుల భూమిలోపలి పొరల్లోకి వెళ్ళకుండా నివారించటం వల్ల కలుపు నివారణ జరిగి క్రిమిసంహారక మందుల ఆవశ్యకత తగ్గి ఎరువులు , క్రిమి సంహారక మందుల ఆదా జరుగుతుంది. తద్వారా పర్యావరణ సమత్యులతను కాపాడుతుంది.

నాణ్యతతో కూడిన దిగుబడులు ; మొక్కలకు వాటి జీవిత కాలమంతా అనుకూల సూక్ష్మ వాతావరణ పరిస్ధితులు కలగటం వల్ల పంట ఏపుగా పెరిగి మంచి నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు పొందవచ్చు.

నేల తయారీ ఖర్చు అదా ; భూమిలో ఎల్లప్పూడూ తేమ నిల్వ ఉండటం వల్ల నేల గుల్లబారి వేరు వ్యవస్ధ బాగా వృద్ధి చెందుతుంది. దీని వల్ల నీరు, ఎరువులు భూమి లోపలి పొరల్లో ఉండి మొక్కలకు అధికంగా లభ్యమవుతాయి. దీని వల్ల పంటకాలం తరువాత నేల తయారీకి అయ్యే ఖర్చు అదా అవుతుంది.

 

ట్రెండింగ్ వార్తలు