Sorghum Cultivation : జొన్న సాగుతో మంచి లాభాలు.. తక్కువ పెట్టుబడి.. తక్కువ రిస్క్..!

ఈ పంటకు కూడా పెట్టుబడులు పెరగడం.. అటు నీటి తడులు కూడా అధికంగా అవసరం ఉండటంతో ప్రత్యామ్నాయంగా ఏడుఎనిమిదేళ్లుగా జొన్నసాగు చేస్తున్నారు.

Sorghum Cultivation : ఒకప్పుడు సన్న బియ్యం కొనలేని పేదలు కడుపు నింపుకోవడానికి జొన్నలను ఆహారంగా తీసుకునేవారు. ఇప్పుడది తారుమారైంది. సన్న బియ్యం తింటే పడని సంపన్న వర్గాలవారు సైతం జొన్నలు వాడుతున్నారు. జొన్న అన్నం, రొట్టెలు ఎక్కువగా తింటున్నారు. దీంతోపాటు పంట సాగు తగ్గడంతో మార్కెట్‌లో జొన్నలకు గిరాకీ పెరిగింది. దీన్నే దృష్టిలో పెట్టుకొని కృష్ణా జిల్లాకు చెందిన కొందరు రైతులు కొన్నేళ్లుగా రెండో పంటగా జొన్నలను సాగుచేస్తూ.. మంచి ఆదాయం పొందుతున్నారు.

Read Also : Vegetable Cultivation : లాభాలు కురిపిస్తున్న కూరగాయల సాగు

తక్కువ పెట్టుబడి.. తక్కువ రిస్క్.. తక్కువ సమయం :
రబీ జొన్న సాగు ఆశాజనకంగా ఉంది. రైతులు కూడా దిగుబడులపై అదే స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు. కేవలం భూమిలోని తేమ, మంచు ఆధారంగా సాగయ్యే పంట కావడంతో కృష్ణా జిల్లా, గన్నవరం మండలం, ముస్తాబాద్ గ్రామంలో రైతులు అధిక విస్తీర్ణంలో సాగుచేశారు. గతంలో రెండో పంటగా మినుమును సాగుచేసేవారు. అయితే చీడపీడల ఉధృతి పెరిగిపోవడం.. వాటి నివారణకు అధిక ఖర్చులు చేయడం.. ఇటు దిగుబడులు కూడా తగ్గుతూ వచ్చాయి. మరోవైపు కూలీల సమస్య కూడా అధికమవడంతో ప్రత్యామ్నాయంగా మొక్కజొన్నను సాగుచేశారు.

రబీపంటగా జొన్నసాగుతో అధిక లాభాలు : 
అయితే ఈ పంటకు కూడా పెట్టుబడులు పెరగడం.. అటు నీటి తడులు కూడా అధికంగా అవసరం ఉండటంతో ప్రత్యామ్నాయంగా ఏడుఎనిమిదేళ్లుగా జొన్నసాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి.. తక్కువ నీటితడులతోనే పంట చేతికి వస్తోంది. అంతే కాదు ఈ పంటకు కూలీల సమస్య కూడా లేకపోవడంతో రైతులు జొన్నసాగే మేలంటున్నారు.

ఖరీఫ్ పంట కాలంలో పండించే జొన్న ఎక్కువగా పశువుల దాణా, కోళ్ళ మేత మరియు ఆల్కహాల్ తయారీ కొరకు వినియోగిస్తారు . రబీ పంటలో సాగుచేసిన జొన్న ఏకమొత్తంగా ఆహారపు అవసరాలకు వినియోగిస్తారు. అయితే  ఇటీవలి కాలంలో ఆరోగ్యాన్నిచ్చే ఆహారపు పంటగా జొన్న బహుళ ప్రజాధారణ పొందింది. మార్కెట్ ధర కూడా ఆశాజనకంగా ఉండడం వల్ల జొన్నను రబీలో ఎక్కువ స్ధాయిలో పండించడానికి రైతాంగం మొగ్గుచూపుతున్నారు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు 

ట్రెండింగ్ వార్తలు