తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు.. అన్నికాలాలకు అనువైన నువ్వుల సాగు

స్వల్పకాలంలో, అతి తక్కువ ఖర్చు, శ్రమతో చేతికొచ్చే పంట నువ్వు. ఈ పంటను ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు రైతులు.

Sesame farming: ఖరీఫ్‌ సమయం దగ్గర పడుతుండటంతో రైతులు పంటలను సాగు సిద్ధమవుతున్నారు. అయితే ఈ సారి నూనెధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో నూనెగింజల పంటల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడినిచ్చే పంటగా నువ్వును చెప్పుకోవచ్చు. ఈ పంటకు నీటి అవసరం కూడా తక్కువే. అందుకే మెట్టప్రాంతాల్లో ఈ పంటను సాగుచేసే రైతులు, ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక తోపాటు మేలైన యాజమాన్యం పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని చెబుతున్నారు వ్యవసాయ అధికారులు

స్వల్పకాలంలో, అతి తక్కువ ఖర్చు, శ్రమతో చేతికొచ్చే పంట నువ్వు. ఈ పంటను ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు రైతులు. నువ్వు గింజల్లో నూనె 50 శాతం, ప్రొటీన్లు 20 నుండి 25 శాతం వరకూ ఉంటాయి. తక్కవు సమయం, తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని నువ్వుపంట ద్వారా పొందవచ్చు. ఈ పంటను ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండించవచ్చు. ముఖ్యంగా మెట్ట ప్రాంత రైతులు ఈ పంట సాగు ఎంతో అనువు. ప్రస్తుతం ఖరీఫ్ సాగుచేయాలనుకునే రైతులు మే 15 నుండి జూన్ 20 వరకు విత్తుకోవచ్చు. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకొని, సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లైతే మంచి దిగుబడి పొందేందుకు అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు నిర్మల్ జిల్లా, మామడ మండల వ్యవసాయ అధికారి నాగరాజు.

Also Read: యాసంగి నువ్వుల పంటలో చీడపీడల నివారణ

ప్రస్తుత కాలంలో నూనెగింజల పంటకు మార్కెట్‌లో మంచి ధర పలుకుంది. నువ్వుల పంట మూడు నెలల్లో చేతికి వస్తుంది. ఈ పంటను సాగు చేస్తే.. రైతులకు మేలు జరుగుతోంది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందవచ్చు.

ట్రెండింగ్ వార్తలు