Sesame Crop : యాసంగి నువ్వుల పంటలో చీడపీడల నివారణ

Sesame Crop : నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, బరువు నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్థుతం మార్కెట్లో క్వింటా నువ్వులకు  రూ. 10 వేల పైనే ధర పలుకుతున్నాయి.

Sesame Crop : యాసంగి నువ్వుల పంటలో చీడపీడల నివారణ

Pest Control Techniques In Sesame Crop

Sesame Crop : రబీ సీజన్‌లో రైతులు పండించే వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది నువ్వు. ఆదాయం కూడా బాగుండడంతో ఏఏటికాయేడు పంట సాగు గణనీయంగా పెరుగుతోంది. ఖరీఫ్‌ పంటకు పెట్టిన పెట్టుబడులు పొందేందుకు వీలుగా రబీలో నువ్వు పంటను రైతులు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు నువ్వు పంటలో చీడపీడల ఉధృతికి కారణమవుతున్నాయి. వీటిని సకాలంలో నివారించాలని రైతులకు సూచిస్తున్నారు  ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్.

Read Also : Vegetable Cultivation : లాభాలు కురిపిస్తున్న కూరగాయల సాగు

నువ్వు, అధిక ఉష్ణోగ్రతల్లో బాగా పెరిగే పంట. వేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా వుంటుంది. నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, బరువు నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్థుతం మార్కెట్లో క్వింటా నువ్వులకు  రూ. 10 వేల పైనే ధర పలుకుతున్నాయి. ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం వుండటంతో వేసవిలో చాలా మంది రైతులు  నువ్వు సాగు చేపట్టారు.

అయితే, యాసంగిలో వేసిన నువ్వు పంట కొన్ని చోట్ల శాకీయ దశలో ఉండగా.. మరికొన్ని చోట్ల పూత దశలో ఉంది. అయితే ఈ సమయంలో పంట నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. శాకీయ దశలో ఉన్న పంటకు చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. వీటి నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులను రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు