Organic Farming : ప్రకృతి వ్యవసాయం చేస్తున్న టీచర్.. అంతర పంటల సాగుతో అధిక ఆదాయం

ప్రకృతి విధానంలో సాగుచేస్తూ.. పెట్టుబడి తగ్గించుకుంటూ.. అధిక లాభాలను పొందుతున్నారు. ఈ విధానాలనే పాటిస్తూ.. ప్రకాశం జిల్లాలో ఓ రైతు మామిడిలో అంతర పంటలు సాగుచేసి ప్రతిరోజు ఆదాయాన్ని గడిస్తున్నారు.

Organic Farming : రైతులు తమ వ్యవసాయ పద్ధతులను మార్పులు చేసుకుంటున్నారు. తక్కువ శ్రమతో ఎక్కువగా లాభాలు పొందే విధానాన్ని అలవర్చుకుంటూ ముందుకుపోతున్నారు. ముఖ్యంగా మామిడి, బొప్పాయి, అరటి  లాంటి పంటలు సాగు చేసే రైతులు అంతర పంటలుగా వివిధ రకాల కూరగాయలు పంటలను ప్రకృతి విధానంలో సాగుచేస్తూ.. పెట్టుబడి తగ్గించుకుంటూ.. అధిక లాభాలను పొందుతున్నారు. ఈ విధానాలనే పాటిస్తూ.. ప్రకాశం జిల్లాలో ఓ రైతు మామిడిలో అంతర పంటలు సాగుచేసి ప్రతిరోజు ఆదాయాన్ని గడిస్తున్నారు.

మామిడిలో అంతర పంటలుగా కూరగాయల సాగు : 
మామిడి మొక్కల మధ్య అంతర పంటలు సాగుచేసిన ఈ క్షేత్రం ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, వజ్జిరెడ్డిపాలెం గ్రామంలో ఉంది. ఇక్కడ అన్నీ చాలా వరకు ఇసుకనేలలే.. మెట్టపంటలే సాగవుతుంటాయి. . కాబట్టి చాలా మంది రైతులు ప్రధాన పంటగా వేరుశనగను వేస్తుంటారు. కొందరు కొబ్బరి, మామిడి తోటలను సాగుచేస్తుంటారు. అయితే తోటలను వేసి సీజన్ లో దిగుబడులు తీసుకొని వదిలేస్తుంటారు. సరైన యాజమాన్య చర్యలు చేపట్టకపోతే ఇక ఆతోటల నుండి దిగుబడి పూర్తిగా పడిపోతుంది.

ఇలా యాజమాన్యం చేపట్టకపోవడం వల్లే రైతు శ్రీహరి కృష్ణ మామిడి తోట దెబ్బతింది. అయితే ఇటీవల కరోనా కారణంగా తాను చేస్తున్న ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి వ్యవసాయ చేస్తున్నారు. స్థానిక ప్రకృతి వ్యవసాయం అధికారుల సలహాలు సూచనలతో మామిడిలో అంతర పంటలుగా కొబ్బరి మొక్కలను నాటారు. అయితే మొక్కల మధ్య దూరం ఉండటం.. ఏడాదికి ఒక పంట దిగుబడి వస్తుంది కాబట్టి.. అంతర పంటలుగా కూరగాయలను సాగుచేస్తూ.. ప్రతి నిత్యం ఆదాయాన్ని పొందుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు అధికారులు. సేంద్రియ విధానంలో పండించిన పంటలను నేరుగా అధికారులే కొనుగోలు చేస్తున్నారు. స్థానికంగా ఔట్ లేట్ ఏర్పాటు చేసి వినియోదారులకు అమ్మకం చేపడుతున్నారు. దీంతో ఆరోగ్యకరమైన పంటలను ప్రజలు తింటుండగా, రైతులకు అధిక ధర అందుతోంది.

Read Also : Marrigold Cultvation : బంతి సాగుతో అధిక లాభాలు పొందుతున్న రైతు

ట్రెండింగ్ వార్తలు