Marrigold Cultvation : బంతి సాగుతో అధిక లాభాలు పొందుతున్న రైతు

బంతిపూల సాగుకు పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదు... పూల దిగుబడి చాలా ఎక్కువ ఉంటుంది. పూల బరువు కూడా ఎక్కువే ఉంటుంది. అందుకే చాలా మంది రైతులు సీజన్ ల వారిగా బంతిపూల సాగుచేపడుతున్నారు. ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు కూడా వీటి సాగు చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.

Marrigold Cultvation : బంతి సాగుతో అధిక లాభాలు పొందుతున్న రైతు

Marrigold Cultvation

Marrigold Cultvation : దేవుడి పూజకైనా.. ఏ శుభకార్యానికైనా పూలు కావాలి.. అందులోనూ మన తెలుగువారు పూలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే పూలకు మార్కెట్ లో అధిక ధర పలుకుతుంటుంది. కొన్నేళ్లుగా రైతులు సంప్రదాయ పంటలు వదిలేసి.. కొత్త పంటల వైపు చూస్తున్నారు రైతులు. అలాంటి వాటిలో బంతిపూల సాగు ప్రత్యేకమైనది. మార్కెట్ లో దీనికి మంచి డిమాండ్ ఉంది.

READ ALSO : Lily Cultivation : లిల్లీ సాగులో చీడపీడల నివారణ పద్ధతులు!

బంతిపూల సాగుకు పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదు… పూల దిగుబడి చాలా ఎక్కువ ఉంటుంది. పూల బరువు కూడా ఎక్కువే ఉంటుంది. అందుకే చాలా మంది రైతులు సీజన్ ల వారిగా బంతిపూల సాగుచేపడుతున్నారు. ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు కూడా వీటి సాగు చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ముఖ్యంగా బంతిపూలు, ఆకర్షణీయమైన రంగులో ఉండి, ఎక్కువ కాలం నిలువ ఉండే స్వభావం ఉన్నందువల్ల పూల సాగుదార్లను, వ్యాపారుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. అందేకే ఈ మద్య వీటిని అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు రైతులు.

పశ్చిమగోదావరిజిల్లా, తాడెపల్లిగూడెం మండలం, కృష్ణాపురం గ్రామానికి చెందిన రైతు వీర వెంకట రామారావు ఈ కోవలోకే వస్తారు . తనకున్న కొబ్బరితోటలో 4 ఏళ్లుగా, అంతర పంటగా ఎకరన్నరలో బంతిపూలను సాగుచేస్తూ.. మంచి దిగుబడులను పొందుతున్నారు. అయితే గత 2 ఏళ్లుగా కరోనా కారణంగా ధర పొందలేకపోయిన ఈ రైతు ప్రస్తుతం మంచి ధర లభిస్తోందని చెబుతున్నారు.

READ ALSO : Rose Cultivation : గులాబీ సాగులో మెళుకువలు, కొమ్మల కత్తిరింపుతో అధిక దిగుబడి!

బంతి పంట కాలం 120 రోజులు . నాటిన 50 రోజుల నుండి పూల దిగుబడి ప్రారంభమవుతుంది. ఎకరాకు 30 నుండి 40 క్వింటాల వరకు దిగబుడిని పొందవచ్చు. రైతు వెంకట రామారావు ఇప్పటికే ఎకరన్నరలో 5 టన్నుల దిగుబడి తీశారు. టన్నుకు 40 వేల చొప్పున రెండు టన్నులను అమ్మారు. 3 టన్నుల పూలను 80 వేల చొప్పున అమ్మారు. అంటే ఇప్పటి వరకు వరకు రూ. 3 లక్షల 20 వేల ఆదాయం పొందారు. మరో 2 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంటంతో మరో ఇదే ధర ఉంటే రూ. 1 లక్షా 60 వేల వరకు ఆదాయం వస్తుంది. అన్ని ఖర్చులు పోను ఎకరాకు రూ. రూ. 1 లక్షా 50 వేల నికర ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారు రైతు వెంకటరామారావు.