Rose Cultivation : గులాబీ సాగులో మెళుకువలు, కొమ్మల కత్తిరింపుతో అధిక దిగుబడి!

గులాబీ పూలు కొత్త చిగుర్ల పై వస్తాయి. కావున కొమ్మ కత్తిరింపులు తప్పనిసరిగా చేయాలి. మొక్క సైజును అదుపులో ఉంచి మంచి ఆకారం సంతరించుకొని మొక్కకు అవసరమైన గాలి వెలుతురు ప్రసరించడానికి కత్తిరింపులు చేయాలి.

Rose Cultivation : గులాబీ సాగులో మెళుకువలు, కొమ్మల కత్తిరింపుతో అధిక దిగుబడి!

Rose Cultivation Techniques, High Yield with Pruning!

Rose Cultivation : గులాబీ సాగుకును రైతులు వాణిజ్య సరళిలో చేపడుతున్న వివిధ ఉత్పత్తుల తయారీలో గులాబీ ఉపయోగపడుతుండటంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంటగా ఉంది. దీని సాగుకు సంబంధించి తేమ శాతం తక్కువగా ఉండి రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే ప్రాంతాలు అనుకూలం . పగటిపూట ఉష్ణోగ్రతలు 15-25 డిగ్రీ సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ కాకుండా ఉండి, 12 గం. కంటే ఎక్కువ వెలుతురూ ఉన్నాట్లైతే ఎగుమతి కి అనువైన గులాబీలు సాగు చేయవచ్చు. ప్లోరిబుండాస్, గ్లాడియేటర్, రాంబ్లర్స్, డబుల్ డిలైట్ కలర్ రోజ్, యూరోపియన్ రోజెస్, ఆల్భా రోజెస్, కాకినాడ గులాబీ, చైనా రోజెస్, లారైన్ విక్టోరియా, మొదలైన రకాలు వాణిజ్యసరళిలో సాగుకు అనుకూలంగా ఉంటాయి. నాటిన దగ్గర నుంచి 4-5 సం. వరకు మంచి దిగుబడి పొందవచ్చు.

గులాబీ పూలు కొత్త చిగుర్ల పై వస్తాయి. కావున కొమ్మ కత్తిరింపులు తప్పనిసరిగా చేయాలి. మొక్క సైజును అదుపులో ఉంచి మంచి ఆకారం సంతరించుకొని మొక్కకు అవసరమైన గాలి వెలుతురు ప్రసరించడానికి కత్తిరింపులు చేయాలి. సంవత్సరానికి ఒకసారి అనగా వర్ష కాలం అయిపోయిన తర్వాత అక్టోబర్, నవంబర్ మాసలలో కొమ్మ కత్తిరింపులు అనుకూలం.హైబ్రిడ్ టి రకాలు మనం కోరుకునే పూత సమయానికి 45 రోజుల ముందుగానే పోర్లిబండ రకాలను 42 రోజుల ముందు కత్తిరించాలి. చనిపోయిన, ఎండిపోయిన కొమ్మలు అన్నిటిని కత్తిరించాలి.

చీడపురుగులు లేదా ఫంగస్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఆకులు మాడిపోతూ ఉంటాయి. పండిన, ఎండిన ఆకులు కొమ్మలు ఎప్పటికప్పుడు తుంచేయాలి. మొక్క ఎంత గుబురుగా ఉంటే అంత ఎక్కువగా పూలు పూస్తాయి అని గుర్తు పెట్టుకోండి.మొగ్గలు వచ్చే దశలో అదనంగా ఎరువులు అందించటం అవసరం. అధికంగా పెరిగే కాండపు చివర్లను కత్తిరించుకోవాలి. తెగులు లేదా పురుగులు ఆశించిన కొమ్మలను కత్తిరించాలి. బలహీనంగా ఉన్న కొమ్మలను,రెమ్మలన్నిటినీ కత్తిరించాలి. గులాబీ పొద మధ్య భాగం ఖాళీగా ఉండేలా కత్తిరింపులు చేస్తే అన్ని కొమ్మలకు గాలి, వెలుతురు,ప్రసరించి పెద్ద సైజు పూలు ఏర్పడతాయి.

గులాబీ మొక్కలు పైన నీళ్ళు స్ప్రే చేయడం వలన అధిక వేడి, దుమ్ము ధూళి నుంచి రక్షణగా ఉంటుంది. ఇలా చేయడం ద్వారా నీరు, ఎరువుల వృధా అవ్వకుండా మొక్కకు చేరి బలాన్నిస్తుంది. మొక్కకు ప్రతి 15 రోజులకు ఒకసారి ఎరువులను అందిస్తూ ఉండాలి. వేసవిలో ఎండా తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉదయం, సాయంకాలం నీటిని అందిస్తూ ఉండాలి. గులాబీ మొక్కలలో ఎక్కువగా కనిపించేది బూజు, ఆకులకు రంధ్రాలు ఏర్పడటం. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు వేపాకును నీళ్లలో మరిగించి పిచికారీ చేయడం లేదా బూడిద చల్లుకోవడం చేస్తూ ఉండాలి. రెడ్ స్పైడర్ మైట్, గొంగళి పురుగు, థ్రిప్స్, పౌడర్లీ మిల్డో, డౌనీ మిల్డో, బ్లాక్ స్పాట్ వంటి తెగుళ్లు గులాబీలో కనిపిస్తాయి. రిడోమిల్, దితానే ఎమ్ 45 వంటి మందులను పిచికారీ చేసుకోవటం ద్వారా పంటను కాపాడుకోవచ్చు.