Smriti Mandhana : స్మృతి మంధానకు మద్దతుగా జెమీమా రోడ్రిగ్స్ బిగ్ డెసిషన్
Smriti Mandhana : భారత మహిళా స్టార్ క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల స్మృతి మంధాన వివాహం..
Smriti Mandhana
Smriti Mandhana : భారత మహిళా స్టార్ క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల తన సహచరురాలు, భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. స్మృతి తండ్రి అనారోగ్యంకు గురికావడంతో ఆమె వివాహం వాయిదా పడింది. ప్రస్తుతం ఆమె తండ్రి కోలుకుంటున్నారు. ఈ క్రమంలో జెమియా రోడ్రిగ్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్)కు జెమిమా రోడ్రిగ్స్ దూరమయ్యారు. నవంబర్ 9న మహిళల బిగ్‌బాష్ లీగ్ 11వ సీజన్ ప్రారంభమైంది. ఇందులో బ్రిస్బేన్ హీట్ జట్టుకు జెమిమా ప్రాతినిధ్యం వహిస్తోంది. అయితే, స్మృతి మంధాన వివాహం కారణంగా గత పదిరోజుల క్రితం జెమీమా భారత్ కు తిరిగొచ్చింది. కానీ, స్మృతి తండ్రి అనారోగ్యంకు గురికావడం, ఆమె పెళ్లి ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో కష్టసమయంలో స్మృతి మంధాన కుటుంబానికి మద్దతుగా ఉండేందుకు జెమీయా స్వదేశంలోనే ఉండాలని నిర్ణయించుకుంది.
ఈ విషయాన్ని బ్రిస్బేన్ హీట్ జట్టు సీఈఓ టెర్రీ స్వెన్సన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్మృతికి మద్దతుగా ఉండేందుకు జెమీమా తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపారు. తిరిగి రాలేకపోతున్నందున ఆమె నిరాశను వ్యక్తం చేసినట్లు తెలిపారు. క్లబ్‌కు, అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ, మిగతా మ్యాచ్‌లకు జట్టుకు జెమీమా శుభాకాంక్షలు తెలిపినట్లు వివరించారు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క విజయం కూడా నమోదు చేయని బ్రిస్బేన్ హీట్, శుక్రవారం అడిలైడ్ ఓవల్‌లో సిడ్నీ సిక్సర్స్‌తో తలపడనుంది. జెమీమా స్థానంలో ఆల్‌రౌండర్ గ్రేస్ హారిస్ తిరిగి జట్టులోకి రానుంది.
