New Labour Laws : కొత్త లేబర్ చట్టాల్లో ఉద్యోగులకి ఇదో బంపర్ న్యూస్..

New Labour Laws : దేశవ్యాప్తంగా కొత్త లేబర్ చట్టాలు అమల్లోకి వచ్చాయి. దీనిపైన ప్రజల్లో చాలా ఆందోళనలు ఉన్నాయి.

New Labour Laws : కొత్త లేబర్ చట్టాల్లో ఉద్యోగులకి ఇదో బంపర్ న్యూస్..

New Labour Laws

Updated On : November 27, 2025 / 1:22 PM IST

New Labour Laws : దేశవ్యాప్తంగా కొత్త లేబర్ చట్టాలు అమల్లోకి వచ్చాయి. దీనిపైన ప్రజల్లో చాలా ఆందోళనలు ఉన్నాయి. అసలు ఈ చట్టాలేంటో, దాని వల్ల తమ జీతాలు ఎంత కట్ అవుతాయో, కపెనీలకు లాభం జరిగి.. ఉద్యోగులకు నష్టం జరుగుతుందేమో అనే భయాలు చాలామందిలో ఉన్నాయి. అయితే, చాలా మందిలో ఉండే మరో డౌట్ ఏంటంటే ఒకవేళ కంపెనీ గనుక ఉద్యోగిని తీసేసినా.. లేకపోతే ఉద్యోగే రాజీనామా చేసినా తమ పరిస్థితి ఏంటనే సందేహం ఉంటుంది. దానికి సంబంధించి లేబర్ చట్టాల్లో కీలక విషయం ఉంది.

Also Read: New Labour Laws : కొత్త లేబర్ చట్టాలు.. మీ జీతం ఎంత కట్ అవుతుంది? చేతికి ఎంత వస్తుంది? చెక్ చేసుకోండి..

ఇప్పటి వరకు అమలవుతున్న విధానం ఏంటంటే.. ఒక ఉద్యోగి రాజీనామా చేసినా లేకపోతే కంపెనీనే వాళ్లను తీసేసినా.. వాళ్లకు రావాల్సిన జీతాలు, గ్రాట్యుటీ, లీవ్ ఎన్ క్యాష్‌మెంట్‌ ఇలాంటివన్నీ సెటిల్ చేయడానికి కనీసం 30రోజుల గడువు తీసుకుంటుంది కంపెనీ. అయితే ఇక నుంచి అలా కాదు. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్ మెంట్ రెండు రోజుల్లో చేయాలి. అంటే ఉద్యోగి లాస్ట్ వర్కింగ్ డే అయిన తర్వాత రెండు రోజుల్లో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్ మెంట్ చేయాలి. అయితే, గ్రాట్యుటీ మాత్రం తర్వాత చెల్లించవచ్చు.

అందరికీ ఇదే రూల్ వర్తిస్తుందా? లేకపోతే కొందరికేనా..?
కొత్త చట్టాల ప్రకారం.. అన్నిరకాల ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. కింది స్థాయి ఉద్యోగులు కావొచ్చు. పైస్థాయిలో ఉండే సీనియర్ లెవల్ ఉద్యోగులు కావొచ్చు. ఎవరికైనా ఈ రూల్ వర్తిస్తుంది. అలాగే, ఉద్యోగి రాజీనామా, లేఆఫ్ తో పాటు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా కూడా రెండు రోజుల్లో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్ మెంట్ చేయాల్సిందే.