Lily Cultivation : లిల్లీ సాగులో చీడపీడల నివారణ పద్ధతులు!

నులిపురుగులు మొక్కల వేర్లపై రంధ్రాలు చేసి వేర్లలోనికి ప్రవేశిస్తాయి. మొక్కలు పాలిపోయి బలహీనంగా ఉంటాయి. మొక్కలను పీకి చూస్తే వేర్లపైన బుడిపెలు ఎక్కువగా ఉంటాయి, ఈ బుడిపెలు వల్ల మొక్కలకు పోషకాలు, నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడి అకులు పసుపురంగుకు మారి మొక్కలు బలహీనపడి చనిపోతాయి.

Lily Cultivation : లిల్లీ సాగులో చీడపీడల నివారణ పద్ధతులు!

Lily Cultivation :

Lily Cultivation : ఏడాది పొడవునా మంచి గిరాకీ ఉండే పంట లిల్లీపూలు. మంచి సువాసన ఉండటంతో బొకేలు, తయారీలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. లిల్లీ పూల నుండి సుగంధ తైలాన్ని కూడా తీస్తారు. దీనికి విదేశాల్లో మంచి ధర పలుకుతుంది. ఒకసారి నాటితే మూడేళ్ల వరకు అదాయం పొందవచ్చు. ప్రత్యేకంగా చీడపీడల విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అయితే సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడి అదాయం పొందవచ్చు.

చీడపీడల నివారణ ;

ఆకులుతినే పురుగులు: లిల్లీ పంటను నాటిన తొలిదశ నుంచి ఆకుపచ్చ రంగులో ఉండే మిడతలు, పెంకు పురుగులు ఆకులను తింటూ, ఆకులపైన రంధ్రాలు చేస్తాయి. పెంకు పురుగులు ఆకులను తినడమే కాకుండా మొక్కల మొదళ్లలో, దుంపలకు రంధ్రాలు చేసి అవి కుళ్లిపోయేలా చేస్తాయి. ఈ పురుగుల ఉనికిని గమనిస్తే లీటరు నీటికి ౭ మి.లీ. ప్రొఫెనోఫాస్‌ లేదా 2 మి.లీ, ఖీరిపైరిఫాస్‌తో పాటు అజాడిరక్టిన్‌ వేపమందు (1500 పీపీఎం) 5మి.లీ: చొప్పున పిచికారి చేయాలి.

రసంపీల్ఫే పురుగులు: ఎదుగుతున్న మొక్కల. ఆకుల అడుగు భాగాన పచ్చదోమ లేదా దీపపు పురుగులు చేసి లేత ఆకుల నుంచి రసాన్ని పీల్పేస్తాయి. దీనివల్ల ఆకులు, ఆకుల అంచులు పసుపురంగుకు మారి ఎండిపోతాయి. ఈ పురుగులతో పాటు ఆకులు, పూలకాడలు, పూమొగ్గలను. ఆశించి, గీకి, రసాన్ని పీల్చే తామర పురుగులు ఇటీవల లిల్లీకి ఎక్కువ నష్టం కలిగిస్తున్నాయి. ఈ తామర పురుగులు ఆశించిన భాగాలపైన గోధుమరంగు చారలు ఏర్పడి, పూలు సరిగా ఎదగక ఎండిపోతాయి.

లిల్లీలో రసంపీల్సే పురుగుల నివారణకు లీటరు నీటికి 0.1 మిలీ. ఇమిడాళ్లోప్రీడ్‌ లేదా 0.8 గ్రా. ఆసిటామిప్రిడ్‌ లేదా 2 మి.లీ. పిస్రోనిల్‌ చొప్పున ఏదో ఒకదానిని కలిపి 15 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి 3సార్లు పిచికారీ చేయాలి.

పూమొగ్గలు తొలిచే పురుగులు: పూత దశలో లిల్లీ పూమొగ్గలను తొలిచి, రంధ్రాలు చేసి లోపలి భాగాలను తినేసి పూలు అమ్మకానికి పనికి రాకుండా చేస్తాయి. ఈ పురుగుల నివారణకు ఎమామెక్టిన్‌ బెంజోయేట్‌ 0.5 గ్రా. లేద్య పూబెండియమైడ్‌ (14 మి.లీ. లేదా స్పైనోసాడ్‌ 0.8 మి.లీ. చొప్పున లీట్రకు నీటికి కలిపి అవసరాన్ని బట్టి 15 రోజుల వ్యవధిలో మందును మార్చి
పిచికారీ చేయాలి.

మొదళ్లు, వేర్లను ఆశించు పిండి పురుగులు: పిండినల్లి లేదా పిండి పురుగులు గులాబీ రంగులో ఉండి, శరీరంపైన తెల్లటి దూది వంటి పదార్థం కప్పి ఉంటుంది. ఇవి లిల్లీ మొక్కల మొదళ్లలో గుంతలుగా చేరి ఆకులు, దుంపల నుంచి రసాన్ని పీల్చేస్తాయి. దీనివల్ల మొక్కలు బలహీనపడి పూలను ఇవ్వవు. ఈ పురుగులు విసర్జించిన తియ్యటి పదార్థం కోసం
మొక్కల మొదళ్లలో చీమలు. ఎక్కువగా తిరుగుతుంటాయి. ఈ పురుగుల ఉనికిని తొలిదశలోనే గుర్తించి క్లోరిపైరిఫాస్‌ (60 ఇసి.) 1 మిలీ లేదా ప్రాఫెనోఫాస్‌ 2 మి.లీతో పాటు జిగురు 0.5 మి.లీ. చౌప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగుల ఉదృతి ఎక్కువగా ఉంటే ఫోరేట్‌ (102) గుళికలు | కిలోలు లేదా కారోప్యూరాన్‌ (38) గుళికలు 10 కిలోల చొప్పున
ఎకరాకు వేసి నివారించవచ్చు.

నులిపురుగులు: నులిపురుగులు మొక్కల వేర్లపై రంధ్రాలు చేసి వేర్లలోనికి ప్రవేశిస్తాయి. మొక్కలు పాలిపోయి బలహీనంగా ఉంటాయి. మొక్కలను పీకి చూస్తే వేర్లపైన బుడిపెలు ఎక్కువగా ఉంటాయి, ఈ బుడిపెలు వల్ల మొక్కలకు పోషకాలు, నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడి అకులు పసుపురంగుకు మారి మొక్కలు బలహీనపడి చనిపోతాయి. లిల్లీ పంటలో మరోరకం నులిపురుగు ఆకులపై బంక లేదా జిగురు వంటి చారలుగా కన్పించి మొక్కను బలహీనపరుస్తాయి. లిల్లీసాగు చేసే పొలానికి విరివిగా వేపపేండి వేయడం ద్వారా నులిపురుగుల బెడదను తగ్గించవచ్చు. పొలంలో మొక్కల్లో నులిపురుగుల ఉనికిని గమనించిన వెంటనే ఎకరాకు 10 కిలోల కార్చోప్యూరాన్‌ గుళికలు. వేసి అదుపు చేయవచ్చు.

ఎర్రనల్లి; పొడి వాతావరణంలో లిల్లీ పంటను ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చేస్తాయి. ఆకుల్లో మొదట పసుపురంగు చారలుగా కనిపించి, క్రమేపి ఆ చారలు కాంస్యం రంగుకు మారి వడలి ఎండిపోతాయి. నివారణకు మొగ్గల ఆకుల అడుగుభాగం బాగా తడిచేలా ఒమైట్‌ 2 మి.లీ. లేదా ఒబెరాన్‌ 1 మి.లీ. లేదా ఇంట్రెప్రిడ్‌ 1.5 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.