Amaravati : అమరావతిలో కొత్త బ్యాంకులకు శంకుస్థాపన.. 6,514 ఉద్యోగాల కల్పన
Amaravati : ఏపీ రాజధాని అమరావతిలో 15 బ్యాంకులు, బీమా ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు.
Nirmala Sitharaman
Amaravati : ఏపీ రాజధాని అమరావతిలో 15 బ్యాంకులు, బీమా ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. రాజధాని సీడ్ యాక్సెస్ రహదారి పక్కన సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం వద్ద మొదటి బ్లాక్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ 15 ఆర్థిక సంస్థల కార్యాలయాల ఏర్పాటు ద్వారా రూ.1,328 కోట్ల పెట్టుబడులు రాజధాని అమరావతికి రానున్నాయని, 6,514 ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్థి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) తెలిపింది. ఈ బ్యాంకు కార్యాలయాలు ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, రాయపూడి, లింగాయపాలెం పరిధిలో కొలువుదీరనున్నాయి.
