Jio Amazing Plan : జియో అద్భుతమైన ప్లాన్.. 912.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.. సింగిల్ రీఛార్జ్‌తో ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు..!
Jio Amazing Plan : జియో యూజర్ల కోసం వార్షిక రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. అన్‌లిమిటెడ్ 5జీతో ప్రో గూగుల్ జెమిని ఏఐతో పాటు వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.
Jio Amazing Plan
Jio Amazing Plan : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. జియో కస్టమర్ల కోసం అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్‌లపై ఆకర్షణీయమైన బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. సరసమైన ధరలో కొత్త రీఛార్జ్ ప్లాన్ కోసం చూసేవారికి అద్భుతమైన ఆఫర్.
ఇటీవలే జియో లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్‌లను (Jio Amazing Plan) కూడా అప్‌డేట్ చేసింది. జియో నుంచి స్పెషల్ 365-రోజుల ప్లాన్ కూడా అందిస్తోంది. సింగిల్ రీఛార్జ్‌తో, ఏడాది పొడవునా ఎంజాయ్ చేయొచ్చు. జియో వార్షిక ప్లాన్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
జియో 365 రోజుల ప్లాన్ వివరాలివే :
జియో లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్లలో కస్టమర్ల కోసం ఒక స్పెషల్ ప్లాన్ అందిస్తుంది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మైజియో యాప్ ద్వారా లేదా అధికారిక జియో వెబ్‌సైట్ విజిట్ చేయడం ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ ధర రూ. 3599 ఉండగా కంపెనీ అనేక బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ పూర్తి 365 రోజులు. కంపెనీ రోజుకు 2.5GB డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ కింద కంపెనీ వ్యాలిడిటీ వ్యవధి వరకు మొత్తం 912.5GB డేటాను అందిస్తుంది.
జియో ఫ్రీ కాలింగ్ బెనిఫిట్స్ :
జియో రూ. 3599 ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్లాన్. వినియోగదారులకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందిస్తుంది. కంపెనీ రోజుకు 100 SMS ఫ్రీగా అందిస్తుంది. ఈ ప్లాన్ కొత్త కనెక్షన్లతో జియోహోమ్ రెండు నెలల ఫ్రీ ట్రయల్‌తో సహా అనేక ఇతర ప్రత్యేక బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. జియోహాట్‌స్టార్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్ కూడా ఫ్రీగా అందిస్తుంది. ఇంకా, ఈ ప్లాన్‌లో 50GB ఫ్రీ జియోక్లౌడ్ స్టోరేజీ కూడా ఉంది.
ప్రో గూగుల్ జెమిని ఫ్రీ యాక్సెస్ :
ఈ ప్లాన్‌కు కంపెనీ మరో స్పెషల్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. రీఛార్జ్ ప్లాన్‌లో రూ. 35100 విలువైన ప్రో గూగుల్ జెమిని ఫ్రీగా అందిస్తోంది. ఈ ప్లాన్ 18 ఏళ్లు పైబబడిన వినియోగదారులకు అందిస్తోంది. అందుకే జియో రూ. 3599 ప్లాన్ అనేక బెనిఫిట్స్ అందిస్తుంది. ఆసక్తిగ జియో యూజర్లకు కూడా అనేక బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ గురించి మరింత సమాచారం కోసం మీరు జియో అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయొచ్చు.
