Food safety : కిరాణ సామాన్లు, కూరగాయలు, పండ్లు ఈ- కామర్స్‌లో ఆర్డర్ చేస్తున్నారా..? బీకేర్ ఫుల్.. అధికారుల సోదాల్లో విస్తుపోయే వాస్తవాలు
Food safety officials Searches : ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంల నుంచి ఇంట్లోకి కావాల్సిన సరుకులు, కూరగాయలు, తినుబండారాలకోసం ఆర్డర్ చేస్తున్నారా..?
Food safety
Food safety officials Searches : ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంల నుంచి ఇంట్లోకి కావాల్సిన సరుకులు, కూరగాయలు, తినుబండారాలకోసం ఆర్డర్ చేస్తున్నారా..? అయితే, ఒక్క నిమిషం ఆలోచించండి.. తాజాగా.. ఈ-కామర్స్ గోడౌన్లలో ఫుడ్‌సేప్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
ఇప్పటి వరకు రెస్టారెంట్లు, హోటళ్లలో కుళ్లిపోయిన ఆహార పదార్థాలు, చెడిపోయిన తినుబండారాలు, పురుగులు పట్టిన ఆహారం ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కానీ, ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాలన్నా కూడా భోజన ప్రియులను అదే భయం వెంటాడుతోంది. స్విగ్గి, జొమాటో, ప్లిప్ కార్ట్, అమెజాన్.. ఇలా ఎందులో అయినా సరుకులు, పండ్లు, ఆహార పదార్థాలకోసం అర్డర్ పెట్టాలన్నా అదే భయం వెంటాడుతోంది. అయితే, ఇప్పుడు అదే నిజమైంది. హైదరాబాద్‌లోని పలు ఈ కామర్స్ గోడౌన్లలోనూ ఇలాంటి పరిస్థితే కనిపించింది.
Also Read: Hyderabad : హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. వారి భద్రతకోసం జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం..
ఫుడ్ సేప్టీ అధికారులు శుక్రవారం హైదరాబాద్‌లోని పలు ఈ- కామర్స్ గోడౌన్లలో దాడులు నిర్వహించారు. జెప్టో, రియల్స్ జియోమార్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, జొమాటో, సిగ్వీ, ప్లిఫ్ కార్డ్, అమేజాన్‌కు సంబంధించి 75 గోడౌన్లలో ఏకకాలంలో సోదాలు జరిపారు. ఈ సోదాల్లో పెద్దమొత్తంలో కుళ్లిన కూరగాయలు, ఆహారపదార్థాలను గుర్తించారు. దాదాపు వెయ్యికిపైగా మిస్ బ్రాండ్లు, లేబుల్స్ లేని ఫుడ్ ప్యాకెట్లు, ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు.
