Prakasam : ఏపీలో మరో బస్సు ప్రమాదం…

పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్దకు రాగానే...షార్టు సర్క్యూట్ తో బస్సులో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున కావడంతో బస్సులో ఉన్న ప్రయాణీకులు నిద్ర మత్తులో...

Bus Accident In Prakasam : ఏపీలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లాలో జంగారెడ్డిగూడెం సమీపంలోని జల్లేరు వాగులో బస్సు పడటంతో డ్రైవర్ సహా పది మంది మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా..ప్రకాశం జిల్లాలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఓ ప్రైవేటు బస్సు హైదరాబాద్ నుండి చీరాలకు వస్తోంది.

Read More : Omicron Variant : మరో 4 ఒమిక్రాన్ కేసులు.. ఆ రాష్ట్రంలో 32కి పెరిగిన కొత్త వేరియంట్ బాధితులు

పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్దకు రాగానే…షార్టు సర్క్యూట్ తో బస్సులో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున కావడంతో బస్సులో ఉన్న ప్రయాణీకులు నిద్ర మత్తులో ఉన్నారు. విషయం తెలుసుకున్న డ్రైవర్..ప్రయాణీకులను అలర్ట్ చేశారు. దీంతో వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే బస్సులో నుంచి దూకేశారు. మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ప్రయాణీకుల లగేజీ పూర్తిగా దగ్ధమైంది. బస్సులో 8 మంది ప్రయాణికులు, ముగ్గురు బస్సు సిబ్బంది ఉన్నారు.

Read More : Omicron Variant : కేరళలో ఒమిక్రాన్ కలకలం.. ఒక్కరోజే 4 కేసులు..

ఇక పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో 13 మందికి గాయాలు అయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్ ను జగన్ ఆదేశించారు.

ట్రెండింగ్ వార్తలు