వచ్చే జన్మలోనూ కుప్పం ముద్దుబిడ్డగానే పుడతా: సీఎం చంద్రబాబు

సుదీర్ఘ కాలంగా తనను ఆదరిస్తున్న కుప్పం ప్రజలకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నానని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

CM Chandrababu Naidu: మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతానని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సొంత నియోజకవర్గానికి వచ్చిన ఆయన మంగళవారం బహిరంగ సభలో మాట్లాడారు. సుదీర్ఘ కాలంగా తనను ఆదరిస్తున్న కుప్పం ప్రజలకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. తాను 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. ఇందులో 8 సార్లు కుప్పం నుంచే గెలిచినట్టు చెప్పారు.

ఇటీవల ముగిసిన ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించారని.. కేవలం 11 సీట్లే ఆ పార్టీకి వచ్చాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో విర్రవీగితే ఇదే గతి పడుతుందని ప్రజలు నిరూపించారని పేర్కొన్నారు. తమ కూటమి ప్రజలు పట్టం కట్టారని, 164 మంది ఎమ్మెల్యేలను గెలిపించారని తెలిపారు. 17 మంది కొత్తవారిని మంత్రులు చేసుకున్నామని, 8 మంది మంత్రులు బీసీలున్నారని వెల్లడించారు. వెనుకబడిన వర్గాలే తన సామాజిక వర్గమని వ్యాఖ్యానించారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో దౌర్జన్య పాలన కొనసాగిందని దుయ్యబట్టారు. మన మీదే దాడులు చేసి.. మనమీదే కేసులు పెట్టారని వాపోయారు.

సీఎం చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే…
నా రాజకీయాలకు కుప్పం ఓ ప్రయోగశాల
17 మంది కొత్త వారిని మంత్రులుగా చేశాం
తొలిసారి గెలిచిన రాయచోటి ఎంఎల్ఏ రాంప్రసాద్ రెడ్డిని మంత్రిని చేశాం
కుప్పంలో నా సామాజిక వర్గం లేదు గానీ వెనుకబడిన వారే నా సామాజిక వర్గం
24 మంది మంత్రుల్లో 8 మంది బీసీలకు అవకాశం ఇచ్చాం
నాకు కుప్పం ఓటర్లు ప్రత్యక్ష దైవం
ఇక్కడ నుంచే ప్రజా క్షేత్రానికి వెళతాను.. మీ ఆశీర్వాదం కోసం వచ్చాను
వచ్చే ఐదేళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటాను
కుప్పం నియోజవర్గాన్ని అగ్రస్థానంలో ఉంచడానికి ప్రయత్నిస్తాను
నేను తొలిసారి కుప్పం వచ్చినప్పుడు ఎంతో వెనుకబడి ఉంది
ఈ వెనుకబడిన ప్రాంతాన్ని ఛాలెంజ్ గా తీసుకొని అభివృద్ధి చేశాను

2019 -24 కాలాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు.. అది ఒక పీడకల
అరాచకం, అప్రజాస్వామ్యంతో నా జోలికే వచ్చారు
కేజీఎఫ్ ను మరపించేలా దోపిడీ చేశారు
నేను కుప్పంకు వస్తుంటే నాపైనే కేసులు పెట్టారు.. నేను మరచిపోతానా?
నా జీవితంలో నన్ను తొలిసారి జైలుకు పంపారు.. బాధ, ఆవేదన ఉంది.
ఇక్కడి ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెబుతున్నా.. కుప్పంలో ఎవడైనా రౌడీయిజం చేస్తే, అదే వారి ఆఖరి రోజు అవుతుందని హెచ్చరిస్తున్నాను

Also Read : స్పీకర్ అయ్యన్నపాత్రుడుకి వైఎస్ జగన్ లేఖ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ..

కుప్పంను ఓ మోడల్ మునిసిపాలిటీగా తయారు చేస్తాను
ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తాను
కుప్పంలోని నాలుగు మండలాలకు 10 కోట్లు తగ్గకుండా ఖర్చు చేసి అభివృద్ది చేస్తాను
అన్ని మేజర్ పంచాయితీలకు రెండు కోట్లు, మైనర్ పంచాయితీకి కోటి రూపాయలు ఖర్చు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తాను
ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్లు ఇస్తాను
ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా మినరల్ వాటర్ అందిస్తాను
హంద్రీ నీవా కాలువ ఇందాకే చూసాను..
కుప్పం కాలువలో గడిచిన ఐదేళ్లలో ఐదు కిలోమీటర్లు మాత్రమే పని చేశారు
సినిమా షూటింగ్ లాగా సెట్టింగ్ ఏర్పాటు చేసి, నీళ్లు కాలువలో పోశారు
నీటి ప్రాజెక్టులపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తాం

Also Read : రాజకీయాల్లో పవన్ కొత్త ప్రయోగం.. మీరు కూడా సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు..

కుప్పంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని నా కోరిక
వీలైనంత త్వరలో ఇక్కడ విమానాశ్రయం వస్తుంది
ఎయిర్ కార్గో సర్వీస్ ప్రారంభించి మన ఉత్పత్తులు ఎగుమతి చేసుకోవచ్చు
ఇంటికి రెండు ఆవులు ఇస్తాను అంటే నన్ను నాడు ఎగతాళి చేశారు
కుప్పం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ (కడా)ని
మళ్ళీ ఏర్పాటు చేసి, ఓ ఐఏఎస్ అధికారిని నియమిస్తాం
కుప్పం మునిసిపాలిటీ పరిధిలో మల్లానూరు, రాళ్ల బూదుగురు అనే రెండు కొత్త మండలాలు ఏర్పాటు చేస్తున్నాం
కుప్పంలో మోడల్ బస్టాండ్ ఏర్పాటు చేస్తాను
కుప్పం ద్రావిడ వర్సిటీని భ్రష్టు పట్టించారు.. దీనిని ప్రక్షాళన చేస్తాను
కుప్పంను ఎడ్యుకేషనల్ హబ్ గా తయారు చేస్తాను

ట్రెండింగ్ వార్తలు