స్పీకర్ అయ్యన్న పాత్రుడుకి వైఎస్ జగన్ లేఖ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ..

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు లేఖ రాశారు. మంత్రులు తర్వాత నాతో ప్రమాణ స్వీకారం

స్పీకర్ అయ్యన్న పాత్రుడుకి వైఎస్ జగన్ లేఖ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ..

YS Jagan Mohan Reddy

YS Jaganmohan Reddy : మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు లేఖ రాశారు. మంత్రులు తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించడం నిబంధనలకు విరుద్ధమని లేఖలో జగన్ పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నట్టున్నారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అసెంబ్లీ రూల్స్ లో నిర్వచించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే 10శాతం సీట్లు వుండాలని ఎక్కడా లేదు. పార్లమెంట్, ఉమ్మడి ఏపీలో ఈ నిబంధనలు పాటించలేదని జగన్ లేఖలో పేర్కొన్నారు.

Also Read : కుదరని ఏకాభిప్రాయం.. చరిత్రలో తొలిసారిగా స్పీకర్ పదవికి ఎన్నికలు.. ఇరుపక్షాల నుంచి నామినేషన్లు దాఖలు

కూటమి సభ్యులు, స్పీకర్ నాపై శత్రుత్వం ప్రదర్శిస్తున్నారు. చచ్చేదాకా కొట్టాలి అంటూ స్పీకర్ వ్యాఖ్యలు బయటపడ్డాయి. అసెంబ్లీలో గొంతువిప్పే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించగలం. పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని లేఖలో అంశాలను పరిశీలించాలని జగన్ కోరారు.

Also Read : వెనక్కు తగ్గని జీవన్ రెడ్డి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు నిర్ణయం!

ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికార పీఠాన్ని ఎన్డీయే కూటమి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత చంద్రబాబు, తరువాత పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేయగా.. ఆ తరువాత మంత్రులు.. వారి తరువాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా.. ఈ విషయాన్ని లేఖలో ప్రస్తావించిన జగన్.. మంత్రులు తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నాడు.