వెనక్కు తగ్గని జీవన్ రెడ్డి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు నిర్ణయం!

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి.. తన ఎమ్మెల్సీ పదవికి

వెనక్కు తగ్గని జీవన్ రెడ్డి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు నిర్ణయం!

Jeevan Reddy

Updated On : June 25, 2024 / 11:43 AM IST

Jeevan Reddy : అధికార కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల నుంచి నేతల చేరికలు చిచ్చు రేపుతున్నాయి. ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతలు అధిష్టానం తీరుపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన పార్టీ మారుతారని వార్తలు రావడం, అనుచరులతో సమావేశం కావడంతో కాంగ్రెస్ అధిష్టానం అలర్ట్ అయింది. జీవన్ రెడ్డితో మంత్రి శ్రీ‌ధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ కోరుట్ల ఇన్ ఛార్జి నర్సింగరావు, తదితరులు భేటీ అయ్యారు. జీవన్ రెడ్డికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి మీ సమస్యను తీసుకెళ్తామని చెప్పారు. దీంతో జీవన్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, జీవన్ రెడ్డి తాజాగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు.

Also Read : సారు మైండ్‌గేమ్‌ను సీఎం రేవంత్‌ ప్లే చేస్తున్నారా? ఇంతకీ కాంగ్రెస్ వ్యూహం ఏంటి?

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి.. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 1గంటకు మండలి చైర్మన్ కు రాజీనామాను జీవన్ రెడ్డి సమర్పించనున్నారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తాను. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతాను. ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

Also Read : పవన్ వద్దకు నేను వచ్చింది అందుకు కాదు: రఘురామకృష్ణరాజు

నాతో కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి మున్షీ మాట్లాడారు. నిన్నటి నుంచి మంత్రులు మాట్లాడుతున్నారు. ఏ పార్టీ నుంచి నాకు ఫోన్లు రాలేదు. బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి నాతో ఎవరూ మాట్లాడలేదని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఏ పార్టీ నన్ను ప్రభావితం చేయలేదు. ఇప్పట్లో నేను ఏ పార్టీలోకి వెళ్లదలచుకోవడం లేదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.