పవన్ వద్దకు నేను వచ్చింది అందుకు కాదు: రఘురామకృష్ణరాజు

గత వైసీపీ సర్కారు పవన్ కల్యాణ్ సినిమాలకు ఇబ్బందులు పెట్టిందని చెప్పారు.

పవన్ వద్దకు నేను వచ్చింది అందుకు కాదు: రఘురామకృష్ణరాజు

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో విజ‌య‌వాడ‌లోని ఆయన క్యాంప్ కార్యాల‌యంలో టీడీపీ నేత, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సమావేశమయ్యారు. ఇవాళ తెలుగు సినీ నిర్మాత‌లు కూడా ప‌వ‌న్‌తో స‌మావేశమైన విషయం తెలిసిందే. ఇదే సమయంలో రఘురామకృష్ణరాజు అక్కడకు రావడం గమనార్హం.

అంతకుముందు రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాతల సమావేశానికి తాను వెళ్లలేదరని అన్నారు. తాను పవన్ కల్యాణ్ ను కలవడానికి వచ్చానని తెలిపారు. సినీ పరిశ్రమ బాగుండాలని కోరుకుంటానని చెప్పారు.

సినీ పరిశ్రమలో అందరితోనూ తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు. గత వైసీపీ సర్కారు పవన్ కల్యాణ్ సినిమాలకు ఇబ్బందులు పెట్టిందని చెప్పారు. పవన్ ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా వచ్చారు కాబట్టి సినీ పరిశ్రమ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని అన్నారు. కాగా, ఇవాళ పవన్ తో సమావేశమైన టాలీవుడ్ నిర్మాతలు సినీ పరిశ్రమ సమస్యలను ఆయనకు వివరించి చెప్పారు.

Also Read : డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో సినీ నిర్మాత‌ల భేటీ