Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సినీ నిర్మాతల భేటీ
తెలుగు సినీ నిర్మాతలతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో సమావేశం అయ్యారు.

Movie producers meeting with Deputy CM Pawan Kalyan
తెలుగు సినీ నిర్మాతలతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో సమావేశం అయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ దృష్టికి నిర్మాతలు తీసుకురానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.
పవన్‌తో సమావేశమైన నిర్మాతల్లో అల్లు అరవింద్, అశ్వినీదత్, ఏ.ఎం.రత్నం, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), దిల్ రాజు, బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య , సుప్రియ, ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ తదితరులు ఉన్నారు.
Balakrishna : ప్రజల కోసం బాలయ్య.. త్వరలో ఏపీలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్..
కాగా..కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్మాతలు ఉప ముఖ్యమంత్రిని కలవడం ఇదే తొలిసారి.