కుదరని ఏకాభిప్రాయం.. చరిత్రలో తొలిసారిగా స్పీకర్ పదవికి ఎన్నికలు.. ఇరుపక్షాల నుంచి నామినేషన్లు దాఖలు

ఇండియా కూటమి స్పీకర్ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీ కె. సురేశ్ నామినేషన్ దాఖలు చేయగా.. ఎన్డీయే కూటమి స్పీకర్ అభ్యర్థిగా ఓంబిర్లా నామినేషన్ దాఖలు చేశారు.

కుదరని ఏకాభిప్రాయం.. చరిత్రలో తొలిసారిగా స్పీకర్ పదవికి ఎన్నికలు.. ఇరుపక్షాల నుంచి నామినేషన్లు దాఖలు

Lok Sabha Speaker election

Lok Sabha Speaker : స్పీకర్ పదవికి చరిత్రలోనే తొలిసారి ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార, విపక్ష పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో ఇరువైపుల నుంచి స్పీకర్ పదవికి అభ్యర్థులు పోటీపడుతున్నారు. దీంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. మంగళవారం పార్లమెంట్ లో ఎన్డీయే కూటమి నేతలు సమావేశం అయ్యారు. స్పీకర్ గా ఓం బిర్లాను మరోసారి ఎంపిక చేసినట్లు ఎన్డీయే పక్ష నేతలకు బీజేపీ తెలిపింది. దీంతో ఎన్డీయే పక్షాల పార్టీలు ఓం బిర్లా ఎంపికకు మద్దతు తెలిపాయి. దీంతో ఆయన స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Also Read : వెనక్కు తగ్గని జీవన్ రెడ్డి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు నిర్ణయం!

రాజస్థాన్ లోని కోటా నుంచి మూడోసారి ఎంపీగా ఓం బిర్లా ఎన్నికయ్యారు. 2019లో తొలిసారిగా లోక్ సభ స్పీకర్ గా ఎన్నికైన ఓంబిర్లా ఎన్నికల ముందు వరకు లోక్ సభ స్పీకర్ గా కొనసాగారు. అయితే, ఎన్డీయే పక్షాలు ఓం బిర్లానే మరోసారి స్పీకర్ పదవికి సరియైన వ్యక్తిగా భావించి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఓం బిర్లాకు మద్దతు తెలపాలని ఇండియా కూటమిని అధికార పక్షం నేతలు కోరారు. అయితే, తమకు ఉపసభాపతి అవకాశం ఇస్తే స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరిస్తామని రాహుల్‌ గాంధీ ప్రకటించారు. ఆయన డిమాండ్ కు అధికార పక్షం నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో స్పీకర్‌ పదవికి పోటీ చేయాలని ఇండియా కూటమి నిర్ణయించింది.

Also Read : Kangana Ranaut : ఎమర్జెన్సీకి 50 ఏళ్ళు.. కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్..

ఇండియా కూటమి స్పీకర్ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీ కె. సురేశ్ ను ఎంపిక చేశారు. సురేశ్ ఎనిమిదిసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. స్పీకర్ ఎంపిక విషయంలో ఇరు పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక అనివార్యం కానుంది. నామినేషన్ దాఖలుకు ఇవాళే చివరిరోజు కావడంతో.. ఎన్డీయే పక్షం తరపున ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ కార్యక్రమంలో జేపీ నడ్డా, అమిత్ షా, బాలశౌరి, కుమార స్వామి, చిరాగ్ పాశ్వాన్ సహా ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొన్నారు. ఇండియా కూటమి తరపున రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి సురేశ్ నామినేషన్ దాఖలు చేశారు.

Also Read: దేశంలో ఎమర్జెన్సీకి 50ఏళ్ళు .. ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు

రేపు ఉదయం 11గంటలకు స్పీకర్ ఎన్నికకు పోలింగ్ జరగనుంది. లోక్ సభ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ సందర్భంగా మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. మల్లిఖార్జున ఖర్గే సీనియర్ నేత.. ఆయనను గౌరవిస్తాం. నిన్నటి నుంచి మూడుసార్లు స్పీకర్ ఎంపికలో ఏకాభిప్రాయం విషయంపై ఆయనతో మాట్లాడానని చెప్పారు. పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ఇవాళ ఉదయం రాజ్‌నాథ్ సింగ్ మల్లికార్జున్ ఖర్గే తో స్పీకర్ ఎంపిక విషయంపై చర్చించాలనుకున్నారు
. కానీ, అతను బిజీగా ఉన్నందున వేణుగోపాల్ మాట్లాడతారని చెప్పారు. టీఆర్‌ బాలు, కేసీ వేణుగోపాల్‌తో మాట్లాడిన తర్వాత లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా ఎవరు ఉండాలనేది ముందుగా నిర్ణయించండి, ఆ తర్వాత స్పీకర్ పదవికి మద్దతివ్వాలనేది నిర్ణయిస్తామని సమాధానం వచ్చినట్లు గోయల్ తెలిపారు.