Home » Lok Sabha Speaker election
లోక్సభ స్పీకర్ గా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఎంపీలు మూజువాణి ఓటుతో స్పీకర్ గా ఓంబిర్లాను ఎన్నుకున్నారు.
లోకసభ స్పీకర్ ఎన్నికలో ఏపీ నుంచి తెలుగుదేశం, జనసేన ఎంపీలు ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. దీంతో వైసీపీకి చెందిన నలుగురు ఎంపీలు ఎవరికి మద్దతు ఇస్తారని చర్చజరిగింది.
ఇండియా కూటమి స్పీకర్ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీ కె. సురేశ్ నామినేషన్ దాఖలు చేయగా.. ఎన్డీయే కూటమి స్పీకర్ అభ్యర్థిగా ఓంబిర్లా నామినేషన్ దాఖలు చేశారు.