దేశంలో ఎమర్జెన్సీకి 50ఏళ్ళు .. ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు

దేశంలో ఎమర్జెన్సీకి 50ఏళ్ళు అయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విటర్) వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు గుప్పించారు.

దేశంలో ఎమర్జెన్సీకి 50ఏళ్ళు .. ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు

PM Narendra Modi

PM Narendra Modi : దేశంలో ఎమర్జెన్సీకి 50ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విటర్) వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు గుప్పించారు. కేవలం అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ప్రజాస్వామ్య సూత్రాన్ని విస్మరించి దేశాన్ని జైలుపాలు చేసిందని అన్నారు. కాంగ్రెస్‌తో విభేదించిన వారిని హింసించి వేధించారని, బడుగు బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకునేందుకు సామాజికంగా తిరోగమన విధానాలు తెరపైకి వచ్చాయని అన్నారు. ఎమర్జెన్సీ విధించిన వారికి రాజ్యాంగంపై తమ ప్రేమను చెప్పుకునే హక్కు లేదంటూ ప్రధాని పేర్కొన్నారు.

Also Read : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మెగా డీఎస్సీతో పాటు ..

ఇదే వ్యక్తులు లెక్కలేనన్ని సందర్భాలలో ఆర్టికల్ 356ను విధించారు. పత్రికా స్వేచ్ఛను నాశనం చేసే బిల్లును తెచ్చారు. ఫెడరలిజాన్ని నాశనం చేశారు.. రాజ్యాంగంలోని ప్రతిఅంశాన్ని ఉల్లంఘించారంటూ మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎమర్జెన్సీ విధించడానికి దారితీసిన మనస్తత్వం కాంగ్రెస్ పార్టీలో చాలా సజీవంగా ఉంది. వారు తమ టోకెనిజం ద్వారా రాజ్యాంగం పట్ల తమకున్న అసహ్యాన్ని దాచిపెట్టారు. దేశ ప్రజలు వారి చేష్టల ద్వారా దాన్ని చూస్తున్నారు. అందుకే వారిని పదే పదే తిరస్కరిస్తున్నారని మోదీ అన్నారు.

Also Read : తెలంగాణ బీజేపీలో పాత- కొత్త సమరం మళ్లీ మొదలైందా?

ఎమర్జెన్సీని ఎదిరించిన మహనీయులు, మహిళలందరికీ ఈ రోజు నివాళులర్పించే రోజు. ఎమర్జెన్సీ చీకటి రోజులు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక స్వేచ్ఛను ఎలా తుంగలో తొక్కింది, ప్రతి భారతీయుడు ఎంతో గౌరవించే భారత రాజ్యాంగాన్ని ఎలా తుంగలో తొక్కిందో మనకు గుర్తు చేస్తుందని తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.