ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మెగా డీఎస్సీతో పాటు ..
మెగా డీఎస్సీతో పాటు టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి - మార్చిలో నిర్వహించిన టెట్ లో ఉత్తీర్ణత కాని వారు ..

Mega DSC in AP
AP Government : ఏపీలో కొలువుదీరిన ఎన్టీయే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సోమవారం తొలి కేబినెట్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, సామాజిక భద్రత పింఛను రూ. 4వేలకు పెంపుతోపాటు నాలుగు నెలల్లో నైపుణ్య గణన పూర్తి.. తొలిదశలో 183 అన్న క్యాంటీన్ల ప్రారంభం వంటి హామీలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
Also Read : AP Cabinet : ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. ఆ ఐదు ఫైళ్లకు ఆమోదం
ఏపీలోని నిరుద్యోగులు ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీకి మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోపాటు.. మెగా డీఎస్సీతో పాటు టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి – మార్చిలో నిర్వహించిన టెట్ లో ఉత్తీర్ణత కాని వారు, తాజాగా B.ED, D.ED పూర్తి చేసిన వారికోసం అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకుంది. డీఎస్సీకి జులై 1న నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మొదట టెట్ నిర్వహించి, ఆ తర్వాత డీఎస్సీ ప్రిపరేషన్ కు 30 రోజుల సమయం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక నుంచి ప్రతి యేటా డీఎస్సీ నిర్వహించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
Also Read : మాజీ ఎంపీటీసీ మహేశ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి