టెట్‌లో క్వాలిఫై కాని వారికి మంత్రి లోకేశ్ గుడ్ న్యూస్.. ఫలితాలు విడుదల

టెట్ లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు అర్హులు కావడం, డీఎస్సీలో టెట్ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉండటంతో ఈ ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2.35 లక్షలమంది నిరుద్యోగ..

Ap TET Results 2024 : టెట్ పరీక్షలో క్వాలిఫై కాని అభ్యర్థులకు మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. టెట్ లో అర్హత సాధించని వారికి మరో ఛాన్స్ ఇస్తామన్నారు. వారికి మరోమారు టెట్ నిర్వహిస్తామని చెప్పారు. అంతేకాదు కొత్తగా బీఎడ్, డీఎడ్ పూర్తైన వారికి టెట్ లో అవకాశం కల్పిస్తామన్నారు మంత్రి లోకేశ్. టెట్ తర్వాత మెగా డీఎస్సీ నిర్వహిస్తామని వెల్లడించారు. టెట్ ఫలితాలను మంత్రి లోకేశ్ విడుదల చేశారు. టెట్ పరీక్షలో 58.4శాతం మంది అర్హత సాధించినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు.

వారికి మరో అవకాశం- మంత్రి నారా లోకేశ్
”ప్రజా ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీకి అందరూ సన్నద్ధం కావాలని కోరుకుంటున్నా. నిరుద్యోగ టీచర్లు గత 3 నెలలుగా ఎదురుచూస్తున్న ఏపీ టెట్ ఫలితాలను ఈరోజు విడుదల చేశాను. టెట్ లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు అర్హులు కావడం, డీఎస్సీలో టెట్ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉండటంతో ఈ ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2.35 లక్షలమంది నిరుద్యోగ టీచర్ అభ్యర్థులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. టెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు నా శుభాకాంక్షలు. ఈ టెట్ లో క్వాలిఫై కాని అభ్యర్థులకు, కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకున్న వారికి అవకాశం కల్పిస్తూ త్వరలోనే టెట్ నిర్వహించబోతున్నాం. ఆ తర్వాత మెగా డీఎస్సీ ఉండబోతుంది. ఈ లింక్ (https://cse.ap.gov.in) ద్వారా టెట్ రిజల్ట్స్ తెలుసుకోండి.”

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షకు 2.35 లక్షల మంది హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 14న రిజల్ట్స్ విడుదల కావాల్సి ఉన్నా… ఎన్నికల కోడ్ వల్ల ఆపేశారు.

Also Read : బొత్స కుటుంబం ఇక ఇంటికే పరిమితమా? ఘోర ఓటమికి ప్రధాన కారణం అదేనా?

ట్రెండింగ్ వార్తలు