AP Assembly : అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ .. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి అంబటి

సభలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో మీసం తిప్పారు. దీంతో మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. మీసాలు సినిమాల్లో తిప్పుకోండి అసెంబ్లీలో కాదు అంటూ మండిపడ్డారు.

Ambati Vs Balakrishna

AP Assembly Session..Ambati Vs Balakrishna: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన కొంతసేపటికే టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా మారి హీటెక్కింది. చంద్రబాబు అరెస్ట్ పై చర్చ జరపాలంటే టీడీపీ పట్టుబట్టింది. స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్ట్ పై  చర్చ జరపాలి అంటూ ప్లకార్డులతో డిమాండ్ చేశారు. టీడీపీ డిమాండ్ పై చర్చకు సిద్ధంగా ఉన్నామని..బీఏసీలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బుగ్గన తెలిపారు.

అయినా సభలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం తిప్పారు. దీంతో మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. చర్చ జరపాలని పట్టుపట్టే పద్ధతి ఇది కాదని బాలకృష్ణ అంటూ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.మీసాలు తిప్పుకోండి సినిమాల్లో కానీ అసెంబ్లీలో కాదు అంటూ బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇద్దరు మధ్యా సవాల్లు ప్రతి సవాళ్లు నెలకొన్నాయి.

బాలకృష్ణ వ్యవహరించిన తీరుపై అంబటి తీవ్రంగా మండిపడ్డారు. బాలకృష్ణ మీసాలు తిప్పుతు రెచ్చగొట్టే చర్యలు చేస్తున్నారని మండిపడ్డారు. చర్చ జరపటానికి మేం సిద్దంగానే ఉన్నాం కానీ టీడీపీ సిద్దంగా ఉందా..? అని ప్రశ్నించారు. చర్చ కోసం స్పీకర్ పై దౌర్జన్యం చేయటం సరికాదన్నారు. టీడీపీ సభ్యులు కావాలనే రెచ్చగొడుతున్నారని అటువంటివారిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతీ సెషన్ లోనే దేనిపైనా చర్చ జరగకుండా టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు.

ఇటువంటి పరిస్థితుల్లో సభ గందరగోళంగా మారటంతో స్పీకర్  సభను పది నిమిషాలు వాయిదా వేశారు. చంద్రబాబు అరెస్ట్ పై సభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. టీడీపీ సభ్యుల నిరసనపై అసహనం వ్యక్తం చేసిన ఆయన.. వారు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతామన్నారు. కేవలం మీడియా దృష్టిని ఆకర్షించేందుకే టీడీపీ ఆందోళన చేస్తోందని బుగ్గన మండిపడ్డారు.

 

ట్రెండింగ్ వార్తలు