రాష్ట్ర ఖజానా నిండాలని ఆరు రొట్టెలు వదలండి: నెల్లూరు రొట్టెల పండుగ భక్తులతో సీఎం చంద్రబాబు నాయుడు

నెల్లూరులో బారా షాహిద్ దర్గా వద్ద రొట్టెల పండుగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

Chandrababu Naidu

Chandrababu : నెల్లూరులో బారా షాహిద్ దర్గా వద్ద రొట్టెల పండుగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ రొట్టెల పండుగకు 20 లక్షల మంది వరకు వస్తారని అంచనా. ఈ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసింది. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగలో పాల్గొన్న భక్తులతో మాట్లాడారు.

Also Read : మైక్రోసాప్ట్ సేవలకు అంతరాయం.. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకులు, విమానయాన, టెలీకాం రంగాలపై తీవ్ర ప్రభావం

”బారా షాహీదర్గా అంటే తనకు నమ్మకమని సీఎం చంద్రబాబు తెలిపారు. బారాషహీద్ దర్గా చరిత్ర గొప్పది. భక్తులు నమ్మకం మరింత గొప్పది. రొట్టెలు పంచుకోవడం, కోర్కెలు తీరడం, ప్రార్ధనలు చేయడం గొప్ప పండుగ. కోర్కెలు తీరిన తరువాత మళ్ళీ వచ్చి మరొకరికి ఇవ్వడం నమ్మకం. ఈ పండుగ సర్వమత సమ్మేళనం. అందరం ఒక్కటే.. ఎవరికి నమ్మకమయిన దేవుడిని వారు ప్రార్ధించాలి. కోర్కెలు కోరండి.. మళ్లీ వచ్చే ఏడాది వచ్చి మొక్కలు తీర్చుకోండి.

Also Read : తాడిపత్రి మున్సిపాలిటీలో ఆసక్తికర దృశ్యం.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..!

రొట్టెల పండుగకు 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ఇప్పటికే ఈ రొట్టెల పండుగకు రూ. 5కోట్లు నిధులు కేటాయించాం. ఈ పండుగకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తాం. ప్రస్తుతం రాష్ట్రం అప్పుల్లో ఉంది. సంపద సృష్టిస్తామనే నమ్మకం ఉంది. సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం కావాలని, రాష్ట్ర ఖజానా నిండాలని ఆరు రొట్టెలు వదలాల”ని భక్తులకు చంద్రబాబు సూచించారు.

ట్రెండింగ్ వార్తలు