JP Nadda: ఏపీ రాజధానికి మోదీ శంకుస్థాపన చేశారన్న నడ్డా.. సీఎంగా ఉన్నప్పుడు తానేం చేశారో చెప్పిన నల్లారి కిరణ్

రాష్ట్ర ప్రజల నెత్తిపై జగన్ శఠగోపం పెడుతున్నారని జేపీ నడ్డా విమర్శించారు.

JP Nadda Meeting at SriKalahasthi

JP Nadda – Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, శ్రీకాళహస్తిలో బీజేపీ (BJP) ఇవాళ బహిరంగ సభ నిర్వహిస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తదితర ముఖ్య నేతలు ఇందులో పాల్గొని మాట్లాడారు. పరకాల కోసం కేంద్రం రాష్ట్రానికి నిధులిస్తుంటే సీఎం జగన్ (Jagan)వాటిని పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు.

రాష్ట్ర ప్రజల నెత్తిపై జగన్ శఠగోపం పెడుతున్నారని జేపీ నడ్డా విమర్శించారు. నకిలీ బటన్ లు నొక్కుతూ, నిధులు ఇస్తున్నామంటూ హంగామా చేస్తున్నారని ఆరోపించారు. అన్ని విభాగాల్లో సీఎం జగన్ దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పారు.

దేశంలో మోదీ ఓటు బ్యాంక్ రాజకీయాలను మార్చారని జేపీ నడ్డా చెప్పారు. తొమ్మిదేళ్లుగా సుపరిపాలన అందించారని అన్నారు. బలహీన, అణగారిన వర్గాల వారి కోసం పాటుపడిన పేదల సర్కారు ఎన్డీఏదని తెలిపారు. కరోనా విజృంభణ సమయంలో దేశంలోని పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేశామని చెప్పారు.

ఏపీ రాజధానికి శంకుస్థాపన చేశారు..

మోదీ వల్ల దేశంలో పేదరికం రేటు తగ్గిందని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చాక జరిగిన అభివృద్ధితో పోల్చుకుంటే మోదీ వచ్చాక ఈ తొమ్మిదేళ్లలోనే ఎన్నో రెట్లు ఎక్కువ అభివృద్ధి జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ వచ్చి ఏపీ రాజధానికి శంకుస్థాపన చేశారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఇప్పటికీ అక్కడ ఏమీ జరగలేదని తెలిపారు.

రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. రాజధానిలేని రాష్ట్రంగా ఏపీ మారిందని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడ్డాయని అన్నారు.

నేను సీఎంగా ఉన్నప్పుడు రూ.7500 కోట్లతో..
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. తాను సీఎంగా ఉన్న సమయంలో రూ.7,500 కోట్లతో జిల్లా ప్రాజెక్టులకు రూపకల్పన చేశానని చెప్పారు. అనంతరం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దానిని అడ్డుకున్నారని తెలిపారు.

సొంత జిల్లా నీటి ప్రాజెక్టులు రద్దు చేసిన వ్యక్తి అని చంద్రబాబుపై కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అలాగే, జగన్ ఈ ప్రాజెక్ట్ ను పట్టించుకోలేదని అన్నారు. ఆయా నేతల అవినీతి గురించి మాట్లాడడానికి రోజులు కూడా సరిపోవని చెప్పారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

Muralidhar Rao : దళిత బంధు పంపిణీలో అవినీతికి కేసీఆరే బాధ్యుడు : మురళీధర్ రావు

ట్రెండింగ్ వార్తలు